ఇంత బోల్డ్ గా… తెగింపుతో మాట్లాడే నటి ఒకే ఒక్కరు ఉన్నారు ఆమె శ్రీ రెడ్డి. నిత్యం ఎవరో ఒకరి మీద ఫైర్ అవుతూనే ఉంటుంది ఆమె. మైండ్ లో ఏమనిపిస్తే అది పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈమధ్య కాస్త నోటి పని తగ్గించి కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి ఎంచక్కగా వంటలు చేసుకుంటూ సంపాదిస్తోంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా కెలికితే మాత్రం వాళ్లకు దిమ్మ తిరిగిపోయే జవాబులు ఇస్తోంది. తాజగా తనపై నెగెటివ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారంటూ తన ట్రేడ్ మార్క్ బూతులతో కనీసం మన మాటల్లో కూడా రాయలేని విధంగా పోస్టులు పెట్టింది.

తనకు నచ్చిన వాళ్ళతో పడుకుంటానని… అదే నాకు ఇష్టం అంటూ రెచ్చిపోయి పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. అనవసరంగా నామీద ఎందుకురా కామెంట్స్ చేస్తారు అంటూ చెలరేగిపోయింది. నీకు నిజంగా మాట్లాడే దమ్ముంటే నాముందుకొచ్చి మాట్లాడాలి కానీ.. కన్నంలో ఎలుకలా చేయకండి అంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చింది.


ఒకరిని జడ్జ్ చేస్తున్నావంటే.. అది మీ ఖర్మ.. దాన్ని నేను అసలు పట్టించుకోను.. అయినా స్టార్ హీరోయిన్లకు ఎఫైర్స్ లెవా..? నయంతారకు ఉన్న ఎఫైర్స్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? పెళ్లి అయిన వాడితో, పెళ్లికాని వాడితో నయన్ ఎఫైర్స్ నడిపించలేదా ? మీరెవరు ఎందుకు ఆమె గురించి మాట్లాడరు ? నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.. ? స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమెను అనే అంట ధర్యం లేదు.. స్టార్ హీరోయిన్లకు స్ట్రగ్లింగ్ హీరోయిన్లకు ఇదే తేడా.. అంటూ పోస్ట్ చేసింది.
































