Actor Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటక రంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగాలలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయశర్మ. నాలుగు రంగాల్లోను పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్ బి శ్రీరామ్ గారి ఒంటెద్దు బండి నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయన ఎన్నో అవార్డులు ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

బాహుబలి లో వదులుకోవాల్సి వచ్చింది…
బాహుబలి సినిమా సమయంలో ఆ సినిమాలో మంత్రి పాత్ర చేసినపుడు రమ్యకృష్ణ ను రాణిగా అంగీకరించే సన్నివేషం వరకు నటించి మూడు రోజుల షూటింగ్ తరువాత తప్పుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పారు. దీనికి కారణం సుబ్బరాయ శర్మ గారి భార్య జ్ఞానప్రసూనాంబ గారి ఆరోగ్యం సరిగా లేకపోవడం, అలాగే పిల్లలు విదేశాల్లో ఉండటం వల్ల భార్యను చూసుకోవాల్సిన బాధ్యత ఉండటం వల్ల తప్పుకున్నారట శర్మ గారు. ఆ సినిమాలో నటించి ఉంటే చాలా బాగుండేదని ఇప్పటికి ఫీల్ అవుతాను అంటూ తెలిపారు. ఇక అలానే కొని సినిమాలలో అవకాశాలు వచ్చినట్లే వచ్చి పోతాయి అంటూ చెప్పారు. ఇక ఇండస్ట్రీలో వర్గ వివక్ష ఉంది అంటూ చెప్పారు సుబ్బరాయ శర్మ.

ఒక నిర్మాత కానీ ఒక డైరెక్టర్ కానీ బాగా గుర్తింపు వచ్చాక తన వాళ్లకు ఏదో ఒక పనిలో అవకాశం ఇవ్వాలని అనుకోవడంలో తప్పు లేదంటూ చెప్పారు. అయితే మరి ఒక సినిమా పలానా పాత్రకు ఇతనైతేనే బాగుంటాడు అన్నపుడు కూడా తనకు సంబంధించిన వాడినే పెట్టుకోవాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే సినిమా అనేది కోట్ల వ్యాపారం, అందులో నావాళ్ళే ఉండాలి అనుకుంటూ పోతే లాస్ అవుతారు. అందుకే టాలెంట్ ఉన్న వాళ్ళను తీసుకుంటారు. అయితే ఈ పాత్ర తన వాళ్ళు చేసినా బయట వ్యక్తిగత చేసినా పెద్ధ మార్పు ఉండదు అన్నపుడు తన వాళ్లకు అవకాశం ఇస్తారు అలాంటి వర్గ వివక్ష ఉంది అంటూ చెప్పారు.


































