Actor Sunil : నా కూతురి ప్రాణాలను కాపాడిన దేవుడు హీరో రాజశేఖర్… సునీల్ ఎమోషనల్ కామెంట్స్!

0
963

నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించిన రాజశేఖర్ ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది ఆదరాభిమానాలను పొందారు.గతంలో మెగాస్టార్ చిరంజీవికి పోటీగా సినిమాలు తీస్తూ స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో రాజశేఖర్ కు మెల్లిమెల్లిగా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీంతో పలు అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన గరుడవేగ మరోసారి రాజశేఖర్ కు బ్లాక్ బస్టర్ అందించింది.

ఇలాహీరోగా సినిమాలో నటించడమే కాకుండా వృత్తిపరంగా రాజశేఖర్ ఒక మంచి డాక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈయన హస్తవాసి బాగుంటుందని ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన దగ్గర వైద్యం చేయించుకునే వారు. ఈ క్రమంలోని కమెడియన్ సునీల్ ఒక సందర్భంలో రాజశేఖర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

రాజశేఖర్ గురించి మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా రాజశేఖర్ కి మంచి అభిమానినని సునీల్ తెలియజేశారు. ఒకానొక సమయంలో తన కూతురికి తీవ్ర అనారోగ్యం చేయటంతో కష్టమని ఎంతో మంది వైద్యులు చెప్పారు. అయితే రాజశేఖర్ వైద్యం చేసి తన కూతురు ప్రాణాలను కాపాడాడని సునీల్ రాజశేఖర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఇక సినిమాల విషయానికొస్తే రాజశేఖర్ ప్రస్తుతం తన సొంత నిర్మాణంలోనే పలు చిత్రాలలో నటిస్తున్నారు.అలాగే తన కూతురు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.