Actor Vijay : కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన హీరో. విజయ్ కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్లో కూడా ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. విజయ్ తమిళ్ లో నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక ఇటీవల వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మొదటిసారిగా తెలుగులో “వారసుడు” అనే సినిమాలో నటించాడు.

ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇటీవల విడుదలైన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న విజయ్ మాత్రం సొంత తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదనే గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
తల్లిదండ్రులతో విజయ్ కి మనస్పర్ధలు వచ్చాయని అందువల్లే విజయ్ తన తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వారసుడు సినిమా తమిళ్ వెర్షన్ ఆడియో ఫంక్షన్ జనవరి 2న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ వేడుకకు చిత్ర బృందంతో పాటు విజయ్ ఫ్యాన్స్ కూడా భారీగా తరలి వచ్చారు.
అలాగే విజయ్ తండ్రి కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎ. చంద్ర శేఖర్, తల్లి శోభన కూడా హాజరయ్యారు.

Actor Vijay : ఫంక్షన్ లో హడావిడిగా ఉన్న విజయ్…
ఈ వేడుకకు హాజరైన విజయ్ స్టేడియంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కుడున్న అభిమానులను, సిబ్బందిని, గెస్టులను పలకరించాడు. అలాగే తన తల్లి దండ్రుల దగ్గరకు కూడా వచ్చి ఏదో నామమాత్రంగా వారిని పలకరించి వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో విజయ్ తన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదన్న వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంపై విజయ్ తల్లి శోభన స్పందిస్తూ.. “విజయ్ ఒక స్టార్ హీరో. అతని సినిమాకు సంబంధించిన ఫంక్షన్లో అంత హడావిడిలో ఉంటే ఒక తల్లిగా నా కొడుకు దగ్గరినుండి ఏం ఆశిస్తాను చెప్పండి?’’ అంటూ తమ మధ్య విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది.



































