Actor Vish : సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. తన సినిమాలతో ఎటువంటి హీరో నైనా కొత్తగా చూపిస్తాడు. తన సినిమాల్లో ఒక్క సారైనా నటించాలని హీరోలు అనుకుంటారు. అలాంటి పూరీ జగన్నాథ్ ఇప్పుడు బాగా ఒక విషయంలో వైరల్ అవుతున్నారు. అదే అసలు పూరీ జగన్నాథ్, ఛార్మి మధ్య ఏముంది అని, వారి బంధం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఈ అనుమానాలు ఉన్నా రీసెంట్ గా బండ్ల గణేష్ ఆకాష్ పూరీ సినిమా ఈవెంట్లో మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం కుటుంబాన్ని, కొడుకుని వదులుకోకూడదు అంటూ మాట్లాడారు. ఇక ఈ స్పీచ్ తో పూరీ ఛార్మి మధ్య ఏముంది అంటూ మళ్ళీ టాక్స్ వచ్చాయి.

వాళ్ళ మధ్య రిలేషన్ అదే…
ఇక పూరీ జగన్నాథ్ తో అత్యంత సన్నిహితంగా ఉండే పూరీ కనెక్ట్స్ సీఈఓ, యాక్టర్ విష్ వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడారు. పూరీ జగన్నాథ్ గ్రేట్ హ్యూమన్ అంటూ మాట్లాడారు. ఛార్మి అనుకుంటే ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. తాను ఒకప్పుడు టాప్ హీరోయిన్, మంచి లగ్జరీ లైఫ్ లో ఉండవచ్చు కానీ ఇలా కష్టపడుతోంది. పూరీ కనెక్ట్స్ కోసం వాళ్లిద్దరూ నిజాయితీగా పనిచేస్తున్నారు. అదే వాళ్ళ మధ్య రిలేషన్. ఇద్దరూ గ్రేట్ వర్కింగ్ పార్టనర్స్ అంటూ చెప్పాడు యాక్టర్ విష్.

ప్రతి సినిమా కోసం నిజాయితీ గా కష్టపడి పనిచేస్తారు. మేము ముగ్గురం ఉంటే ఇంకేమి మా మధ్య చర్చకు రావు కేవలం మేము చేస్తున్న ప్రాజెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతాము అంటూ చెప్పారు. ఇక ప్రస్తుతం చేస్తున్న రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు అన్ని ఖచ్చితంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నాం. ఇక లైగర్ సినిమా విషయంలో ప్రతిదీ కొత్తగా సెన్సేషన్ గా ఉండాలని భావించము. అందుకే ప్రొమోషన్స్ ను కూడా విభిన్నంగా చేస్తున్నాము అంటూ విష్ చెప్పారు. ఇక బండ్ల గణేష్ ఆకాష్ పూరీ చోర్ బజార్ సినిమా ఈవెంట్లో పూరీ గారి గురించి మాట్లాడినదానికి ఆయన అసలు స్పందించలేదు ఎందుకంటే ఆయన వేరేవాళ్ళు ఆయన గురించి ఎమ్ మాట్లాడుకుంటున్నారో అనే విషయాలకు ప్రాధన్యత ఇవ్వరు. కేవలం ఆయన చేస్తున్న పని గురించి మాత్రమే ఆలోచిస్తారు అంటూ పూరీ గురించి చెప్పాడు విష్ణు రెడ్డి.

































