Actress Aamani: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు కాకుండా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎంతోమంది నటీమణులు ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నారనే విషయం మనకు తెలిసిందే. ఇలా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి ఎంతో మంది సినీ తారలు ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు.

ఇకపోతే ఈ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు కేవలం ఇండస్ట్రీలోనే మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరంగంలో కూడా ఉంటాయి. అయితే సెలబ్రిటీలు మాత్రం తాము ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామని నిర్భయంగా బయటికి చెబుతున్నారు.అయితే కమిట్మెంట్ అడిగినప్పుడు ఇవ్వాలా వద్ద అనేది పూర్తిగా మన వ్యక్తిత్వం పై ఆధారపడి ఉంటుందని చెప్పాలి.
ఇలా ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలియజేయగా తాజాగా సీనియర్ నటి ఆమని కూడా తాను కెరియర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేశారు. తను కోలీవుడ్ ఇండస్ట్రీలో ఆడిషన్స్ కోసం ఎన్నో కంపెనీలకు వెళ్లాను అయితే కొందరు రిజెక్ట్ చేయడం మరికొందరు తర్వాత ఫోన్ చేసి చెబుతామని చెప్పేవారు. ఇలా కొందరి డైరెక్టర్ల మేనేజర్లు తనకు ఫోన్ చేసి బీచ్ కి రమ్మని చెప్పేవారు.

Actress Aamani: ఇండస్ట్రీలో అందరూ చెడ్డ వాళ్లే ఉండరు…
ఇక కొందరు మేనేజర్లు సార్ రమ్మంటున్నారు మీరు రావాలి అని చెప్పేవారు. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు అమ్మను కూడా వెంట తీసుకెళ్లే దాన్ని ఈ విషయం వారికి చెబితే ఒంటరిగా రమ్మని తనకు ఫోన్లు చేసేవారని తెలిపారు.అయితే వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారో నాకు తెలియదు. ఈ క్రమంలోనే మరి కొంతమంది మేనేజర్లు వాళ్ళు పిలవగానే వెళ్ళకూడదు ఎందుకు పిలుస్తున్నారో ఆలోచించుకోవాలి అని చెప్పడంతో తాను అప్పటి నుంచి జాగ్రత్త పడ్డానని తెలిపారు. ఇండస్ట్రీలో అందరూ చెడ్డ వాళ్ళు ఉండరని కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారని తాను ఎప్పుడు మంచి వాళ్ళతోనే పనిచేశానని ఈమె తెలియజేశారు.





























