ఐశ్వర్య రాజేష్… తెలుగు తమిళ చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన ఐశ్వర్య ఎంతోమందికి ఆదర్శం. ఇటీవల ఆమె తెలుగులో నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ భార్యగా ‘సువర్ణ’ పాత్ర లో ఆమె తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. లాక్ డౌన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటో ఒకటి షేర్ చేశారు.

ఐతే ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోను హీరోయిన్ త్రిషతోపాటు కొన్ని లక్షల మంది లైక్ చేశారు. ఈ ఫొటోలో ఆమె లుక్ అదిరిందంటూ అనేక మంది కామెంట్లు చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆమెపై తనకు ఉన్న అభిమానాన్ని తెలుపు ఒక కామెంట్ పెట్టాడు. ‘త్రిపురలో నేను మీకు పెద్ద అభిమానిని. మీ కోసం ప్రాణాలు కూడా ఇస్తాను. మీ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో మీకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటి ఉంది. నిజంగా మీరంటే నాకు చాలా ఇష్టం అక్క’ అని పోస్ట్ చేశాడు.

దీనిపై స్పందించిన ఐశ్వర్య ’నీ అభిమానానికి థ్యాంక్స్.. కానీ దయచేసి అటువంటి కామెంట్స్ చేయకు. ఎదుటి వ్యక్తి కోసం చనిపోవడానికి మనం బ్రతకడం లేదు. నువ్వు హ్యాపీగా ఉన్నానని ఒక్క మాట చెబితే నాకు అదే చాలు. మరోసారి అలా మాట్లాడను అంటే..నేనెప్పుడూ నీకు మంచి ఫ్రెండ్ గా ఉంటాను. జాగ్రత్త’ అంటూ రిప్లై ఇచ్చింది. కాగా, ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో నాని సరసన “టక్ జగదీష్” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది..



























