Actress Asmitha : ఈటీవీ లో ఒకప్పట్లో వచ్చిన ‘పద్మావ్యూహం’ లాంటి సీరియల్ నుండి ‘మురారి’ వంటి సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన నటి అస్మిత. అంతవరకు హీరోయిన్ రోల్స్ తో అదరగొట్టిన అస్మిత ఒక్కసారిగా ‘అగ్నిసాక్షి’ సీరియల్ లో భైరవి లాంటి విలన్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరింత ప్రేక్షకులకు దగ్గరైన అస్మిత ప్రస్తుతం యాక్టింగ్ కి గుడ్ బై చెప్పి కేవలం తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన ఫాలోయర్స్ కి బ్యూటీ టిప్స్, ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇంటిని చూపించారు అస్మిత .

అభిరుచికి తగ్గట్టు డ్రీమ్ హౌస్…
బుల్లితెర మీద ఎన్నో సీరియల్స్ లో నటించిన అస్మిత కొరియోగ్రాఫర్ సుధీర్ ను ప్రేమ వివాహం చేసుకుని నటనకు గుడ్ బై చెప్పేసారు. కేవలం యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ అభిమానులను పలకరిస్తున్న అస్మిత వారి అభిరుచికి తగ్గట్టు ఇంటిని డిజైన్ చేసుకున్నారు. కొత్తగా చేరిన ఇంటి హోమ్ టూర్ అభిమానులను ఆకట్టుకుంది. అపార్ట్మెంట్ లో చిన్న స్పేస్ ను కూడా తన అభిరుచికి తగ్గట్టు డిజైన్ చేయించుకున్నారు అస్మిత.

మొత్తం ఇంటిని వైట్ షేడ్స్ ఎక్కువ వాడి డిజైన్ చేసుకున్నారు. చిన్న కిచెన్ లివింగ్ రూమ్ తో టూ బెడ్ రూమ్స్ లో మూడు రూమ్స్ గా చేసి స్పానిష్ టైల్స్ తో బాల్కనీ డిజైన్ చేయించుకున్నారు అస్మిత. దాదాపు రెండు సంవత్సరాల నుండి ఇంటికి కావాల్సిన వస్తువులను తెచ్చుకున్నారట అస్మిత. తక్కువ స్పేస్ ను అందంగా తీర్చిడిదదుకున్న అస్మిత సుధీర్ ల ఇల్లు చూడచక్కగా ఉండి వ్యూయర్స్ ని ఆకట్టుకుంటోంది.



























