Actress Ester Noronha : విడాకులకు కారణం, నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు… చివరకు బిగ్ బాస్ లో కూడా వదల్లేదు…: నటి ఎస్తేర్ నోరోన్హా

0
223

Actress Ester Noronha : పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాక విడిపోవాలి అనే నిర్ణయం తీసుకుంటున్న అనేక జంటలను నేటి సమాజంలో చూస్తున్నాం. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దలు కుదుర్చిన పెళ్లి అయినా ఇద్దరి మధ్య మనస్పర్థసలు వస్తే కూర్చొని పరిష్కరించుకుని సర్దుకుపోవాలని అనుకోవడం లేదు, విబేధాలు వచ్చిన మరుక్షణం విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇది సాధారణ జనం నుండి సెలబ్రిటీల వరకు కామన్ అయిపోయింది. అలా పెళ్ళైన ఆరు నెలలకే విడిపోయిన జంట సింగర్ నోయెల్ మరియు హీరోయిన్ ఎస్తేర్ జంట. వీరిద్దరిదీ పెద్దలు కుదుర్చిన వివాహం, అంతా సవ్యంగా ఉంది అనుకునేలోపు పెళ్ళైన ఆరు నెలలకే విడిపోయి ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు.

విడిపోయి నాపై నిందలు వేసాడు…

విడిపోడానికి కారణాలు చెప్పకపోయినా విడిపోయాక భాగస్వామి మీద నిందలు వేయకూడదు. విడిపోడానికి ఇద్దరిదీ సమానమైన బాధ్యత ఉంటుంది. కానీ నోయెల్ ఎస్తేర్ తో విడిపోయి ఆమెపై నిందలు వేసి ఆమె పై నెగటివ్ ప్రాచారం చేశాడంటూ ఎస్తేర్ ఆరోపించారు. నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు అంటూ కామెంట్స్ చేసారు. విడాకుల తరువాత బిగ్ బాస్ కి వెళ్లిన నోయెల్ విడాకుల ఇష్యూని సానుభూతి కోసం వాడుకున్నాడు. ఇలా కూడా చేస్తారా అనిపించింది అంటూ ఎస్తేర్ అభిప్రాయపడ్డారు.

అంతవరకు వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ నోయెల్ నన్ను బాగా బ్యాడ్ చేయడంతో నెగెటివ్ కామెంట్స్ ట్రోల్ల్స్, మెసేజెస్ ఎక్కువవడంతో ఇక్కడి మీడియా కూడా నేను వాటికి సమాధానం చెప్పాలని ఎదురుచూడటంతో మళ్ళీ 3 ఇయర్స్ తరువాత తెలుగు సినిమా చేసి, ఇక్కడకి వచ్చాక మళ్ళీ ఆ ఇష్యూ గురించి మాట్లాడాను అంటూ చెప్పారు. ఆరు నెలల తరువాత విడాకులు తీసుకున్న ఇద్దరం కలిసి ఉన్నది కేవలం పదహారు రోజులు మాత్రమే. ఈ విషయం చెబితే ఎవరూ నమ్మరు. తప్పులు రెండు వైపులా ఉంటాయి కానీ ఒకరినే నిందించడం తప్పు అంటూ చెప్పారు ఎస్తేర్.