టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్టు వెల్లడించారు హంస నందిని. 18 ఏళ్ల క్రితం తన తల్లికూడా ఇదే వ్యాధితో మరణించిందని ఈ సందర్బంగా తెలిపారు హంస నందిని.

అయితే ఇప్పుడు తానూ తప్పక ఈ మహమ్మారిని జయిస్తాననే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హంస నందిని కీమో థెరపీ తీసుకుంటున్నారు. ఇప్పటికే 9 సైకిల్స్ పూర్తవగా, మరో 7 సైకిల్స్ మిగిలి ఉన్నాయని తెలిపారు.
No matter what life throws at me, no matter how unfair it may seem, I refuse to play the victim. I refuse to be ruled by fear, pessimism, and negativity. I refuse to quit. With courage and love, I will push forward. pic.twitter.com/GprpRWtksC
— Hamsa Nandini (@ihamsanandini) December 20, 2021
హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హంస నందిని మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అయితే స్పెషల్ సాంగ్స్, గెస్ట్ అప్పెరియన్స్ లతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించారు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో టైటిల్ సాంగ్ లో అలరించిన విషయం తెలిసిందే.































