Actress Jayasudha : సినిమా ఇండస్ట్రీని పాలిటిక్స్ ను వేరు చేయలేము. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టాక ఎంతో మంది సినిమా తారలు పాలిటిక్స్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పటికీ సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉంటూ పాలిటిక్స్ కి గ్లామర్ అద్దుతున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న అలాంటి సీనియర్ హీరోయిన్ జయసుధ గారు వైసీపీ లోకి జగన్ సమక్షంలో చేరిపోయారు. గత ఎన్నికల సమయంలోనే చాలా మంది ఇండస్ట్రీ నుండి వైసీపీ వైపు చేరుతున్నట్లు చెప్పారు. ఇక అప్పట్లో జయసుధ పవన్ కళ్యాణ్ మీద చేసిన కొన్ని కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి.

పవన్ ను నేను నమ్మను…
జగన్ తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని జయసుధ చెబుతూనే పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆయన మాటల మీద తనకు నమ్మకం లేదని అతడిని నమ్మలేమంటూ చెప్పారు. జగన్ కి సినిమా ఇండస్ట్రీ నుండి సపోర్ట్ లేదనే మాట అవాస్తవం అంటూ చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నారని కొంతమంది ఓపెన్ గా చెబుతున్నారని చెప్పారు.

మరికొందరు చెప్పకుండానే రహస్యంగా సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు త్వరలో బయటికి వస్తారని చెప్పారు. జగన్ వస్తే ఏపీ బాగుపడుతుందని అప్పట్లో జయసుధ జగన్ గురించి అలాగే పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ సారి ఎన్నికల సమయానికి వైసీపీ కి ఇండస్ట్రీ నుండి ఎంత మంది సపోర్ట్ చేస్తారో చూడాలి.

































