Actress Jyothi : హీరోయిన్ అవ్వాలని తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కమెడియన్ గాను పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి, కృష్ణ రెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన ‘హంగామా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆపై వాంప్ తరహా పాత్రలను ఎక్కువగా చేసిన జ్యోతి బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్నారు. ఇక సినిమాలలో నటిస్తున్న సమయంలో తనపై వచ్చిన వివాదాల వల్ల అవకాశాలు తగ్గి ఇబ్బందులు పడి తన కొడుకుతో కలిసి ఉంటోన్న జ్యోతి తన వ్యక్తిగత జీవితం గురించి తాను ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పింది.

ఆయన అమెరికాలో నన్ను అవమానించారు…
తానా సభలకు సినిమా ఇండస్ట్రీ నుండి కళాకారులు అమెరికా వెళ్లి ప్రదర్శనలు ఇవ్వడం అలాగే మ్యూజిక్ నైట్స్ ఉండటం కామన్. అలా తన సభలకుకు ఆహ్వానం మేరకు సినీ పరిశ్రమ నుండి వెళ్లిన వారిలో జ్యోతి ఉండగా అక్కడికి వెళ్ళాక గ్రూప్స్ గా స్కిట్లను వేయాలి. అయితే ఏవిఎస్ గారి గ్రూప్ లో ఉన్న జ్యోతిని ఏవిఎస్ గారు నీకు అంతగా నటన రాదు అంటూ చెప్పి వేరే గ్రూప్ కి వెళ్ళమన్నారట.

చాలా అవమానంగా అనిపించింది అంటూ జ్యోతి ఆ సంఘటన గుర్తు చేసుకున్నారు. ఏవిఎస్ గారు వేసే కుళ్ళు జోకులకు నవ్వలేదని అలాగే ఆయన భజన చేయకపోవడం వల్లే ఇలా చేసారంటూ చెప్పింది. ఒకరి భజన చేయడం చేతకాదు అలాంటివి ఇంకెవరైనా చేస్తున్నా దూరం నుండి చూస్తా అంతే, అలాంటివాటికి దూరం అంటూ చెప్పి, ఏ గ్రూప్ లో వెళ్లి పార్టిసిపేట్ చేయాలో అర్థం కాక పరుచూరి గోపాల కృష్ణ గారి వద్దకు వెళ్లి విషయం చెబితే వాడి బొంద నా టీంలో ఉండు నువ్వు అంటూ చెప్పారట.



























