“భరత్ అనే నేను” చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్‌లో వైబ్రేటర్ వాడే శృగార సన్నివేశంలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ ఒక్క సన్నివేశంతో సంచలనం సృష్టించిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఆ సన్నివేశం కోసం తాను ఎలా ప్రీపేర్ అయ్యిందో సోషల్ మీడియాలో తెలియజేసింది.

నెట్‌ఫ్లిక్స్‌లో టెలీకాస్ట్ అయిన “లస్ట్ స్టోరీస్” విమర్శకుల ప్రశంసలతో పాటు, కమర్షియల్‌గా కూడా సక్సెస్ సాధించింది. ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యంగా కియారా నటించిన వైబ్రేటర్ సీన్ సంచలనం సృష్టించింది. ఈ షోలో కియారా మేఘ అనే గృహిణి పాత్రలో కనిపించింది. పెళ్లి తరువాత చాలా రోజులుగా శృంగారంలో సంతృప్తిని పొందలేక ఇబ్బందులు పడే పాత్రలో ఆమె అద్భుతంగా నటించిది. ఆమె భర్తగా విక్కీ కౌషల్ కనిపించాడు. ఇక ఈ షోలో పాల్గొన్న కియారా ఆ సన్నివేశం కోసం తాను ఎలా ప్రీపేర్ అయ్యిందో తెలియజేస్తూ.. ఆ సన్నివేశంలో నటించే ముందు రోజు రాత్రి తాను ఎంతో నెర్వస్ అయ్యానని చెప్పింది.

మహిళలు వైబ్రేటర్ ఎలా వాడతారో గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకున్నానని, “అగ్లీ ట్రూత్” లాంటి కొన్ని సినిమాల్లోని సన్నివేశాలను కూడా చూశానని చెప్పింది. అదండి విషయం.. మొత్తానికి గూగుల్ తల్లిని సినీతారల దగ్గర్నుండి చిన్న నిక్కరు వేసుకునే పిల్లోడు వరకూ అందరూ తమ ఇష్టానుసారం వాడేసుకుంటున్నారన్నమాట.. ఆధునిక టెక్నాలజీ అంటే ఇదేనేమో.! ఇక మన బాలీవుడ్ భామ కియారా తాజా అప్ డేట్స్ సినిమాల సంగతికొస్తే కియారా నెక్ట్స్ మూవీస్ కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ షేర్‌షా, లక్ష్మీ బాంబ్ సినిమాల్లో అక్షయ్ కుమార్‌తో కలిసి నటిస్తోందని తెలిసింది.



























