Actress Kalpika Ganeshan : హైదరాబాద్ లో పుట్టిన అయ్యంగర్ కుటుంబానికి చెందిన అమ్మాయి కల్పిక గణేశన్. మొదట మోడలింగ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కల్పిక ఆ తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రయాణం’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా తరువాత సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సీత ఆన్ రోడ్ వంటి పలు సినిమాల్లో నటించింది. ఇక అటు కొన్ని వెబ్ సిరీస్ లోనూ నటించిన కల్పిక తాజాగా తమిళంలో మెయిన్ లీడ్ గా ‘పెరోల్’ అనే సినిమాలో నటించింది. తమిళంలో ఈ సినిమాకు మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ఇక కల్పిక సోషల్మీ డియాలో చాలా అబ్యూస్ ను ఎదుర్కొంటోంది. ఇంస్టాగ్రామ్ దీనికి సంబంధించిన స్టోరీస్ పెడుతుండగా ఇటీవల జరిగిన ఒక ఇష్యూతో మరీ ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతున్నాను అంటూ తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ప్రాస్టిట్యూట్ అంటూ మాట్లాడింది… పోలీస్ గార్డ్ కు లెంపకాలు వేయాలనిపించింది…
కల్పిక చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో అబ్యూస్ గురించి మాట్లాడుతూ ఇటీవల తాను ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి అతిధి గా వెళ్లగా అక్కడ జరిగిన సంఘటనల వల్ల ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆ విషయాన్ని చెప్పడం వల్ల ఇక బాగా ట్రోల్స్ కి గురవుతున్నట్లు తెలిపింది. ఆ ఇన్స్టిట్యూట్ కి కల్పికను ఆహ్వానించిన 15 ఏళ్ళ అమ్మాయి సోషల్ మీడియాలో అక్కడ జరిగిన విషయాలను చెప్పినందుకు చాలా తప్పుగా మాట్లాడింది. ఇక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మొదట చుసినపుడే తాను గెస్ట్ ఏమిటి ప్రొస్టిట్యూట్ లాగా ఉంది అంటూ బూతులు మాట్లాడిందట కల్పిక ను. ఇవన్నీ ఇంటర్వ్యూలో చెబుతూ కల్పిక ఆమె తల్లేనా అనిపించింది, సిగ్గు లేదా అలా మాట్లాడటానికి అనిపించింది. ఆ అమ్మాయి నా ఫోన్ నెంబర్ ఎంతమందికి ఇచ్చిందో తెలియదు అప్పటి నుండి బ్యాడ్ మెసేజ్ లు బూతులు మాట్లాడుతూ పోస్ట్లు ఎక్కువయ్యాయి. సైబర్ పోలీసులను ఆశ్రయించినా బట్టలిప్పుకుని ఫోటోలు పెట్టి మళ్ళీ సహాయం కోసం మమ్మల్ని అడిగితే ఎలా అంటూ మాట్లాడారు.

ఇక ఒకరోజు చేయి గాయమైంది కారు పార్కింగ్ లో ఒక బైక్ అడ్డంగా ఉందని కొంచెం పక్కకు తీయమంటే ఎస్ ఐ బాడీ గార్డ్ నేనేందుకు తీయాలి అంటూ జబర్దస్త్ చూస్తూ కూర్చున్నాడు. వాడికి అక్కడే లెంపకాయలు వేయాలనిపించింది. ఇలాంటి సొసైటీలో మనం ఉన్నాం. ఇక సమంత లాంటి సెలబ్రిటీలకే ఇలాంటి ట్రోల్స్ అవన్నీ తప్పడం లేదు తాను ఎంతో ధైర్యంగా పోరాడుతోంది. మా ఇద్దరిదీ ఒకటే, తాను యశోద లో చెప్పిన విషయం మేము పెరోల్ అనే తమిళ సినిమాలో ఇంకా బాగా చెప్పాం అంటూ కానీ తెలుగులో సినిమా విడుదల అవడానికి యశోద సినిమా అదే రోజు విడుదల అవ్వడం వల్ల స్క్రీన్స్ దొరకలేదు, నాకు సమంతనే పోటీ వచ్చింది అంటూ చెప్పింది కల్పిక.
































