Actress Krishna Kumari : అందుకే నాకు ఆవేశం వచ్చింది.. సావిత్రి చనిపోయాక నేను వెళ్ళలేదు : కృష్ణకుమారి.

0
1067

Actress Krishna Kumari : అలనాటి అందాల నటి, నాటి దక్షిణాది సూపర్ స్టార్లందరి సరసనా హీరోయిన్ గా నటించిన కృష్ణకుమారి. తెలుగులో వందకు పైగా సినిమాల్లో నటించారామె. తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించారు. కృష్ణకుమారి రాజమండ్రికి చెందిన వారు. అయితే వారి కుటుంబం పశ్చిమబెంగాల్ లోని నైహతీకి వలస వెళ్లింది. కృష్ణకుమారికి మరో వెటరన్ నటి షావుకారు జానకి అక్క వరస అవుతుంది. ‘నవ్వితే నవరత్నాలు’ అనే సినిమాతో కృష్ణకుమారి తొలిసారి తెరపై అగుపించారు. ఆ తర్వాత అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు.

‘పాతాళభైరవి’లో ఆమె గంధర్వకాంతగా కనిపిస్తారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీగణేషన్, జగ్గయ్య తదితర నాటి స్టార్ల సరసన ఆమె హీరోయిన్ గా నటించారు. తెలుగులో సుమారు 130 సినిమాల్లో నటించిన కృష్ణకుమారి, తమిళంలో ముప్పై సినిమాల వరకూ నటించారు. అలనాటి జానపద చిత్రాల కథానాయకుడు కాంతారావుతో దాదాపు 28 చిత్రాల్లో ఆమె నటించడం విశేషం. వివాహానంతరం ఆమె తెరకు దూరమయ్యారు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆపై తెరపై నుంచి మాయమయ్యారు.
బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ ను ఆమె వివాహమాడారు. వీరికి ఒక కుతూరు ఉంది. పిచ్చిపుల్లయ్య, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, చిక్కడూ దొరకడు, బందిపోటు, మానవుడు దానవుడు.. కృష్ణకుమారి నటించిన విజయవంతమైన చిత్రాలు.

నటిగా ఆమె అనేక అవార్డులను పొందారు. ఆమె ఒక సందర్భంలో ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఆనాటి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు… కొంతమంది దర్శక నిర్మాతలు తనను సినిమా నుంచి తప్పించడం కొరకు తనపై ఏవేవో అపోహలు సృష్టించేవారని అది సినీ పరిశ్రమలో తనను బాధ కలిగించిందని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే “లక్షాధికారి” చిత్రం కోసం దర్శక నిర్మాతలు తనను స్విమ్ సూట్ ధరించాలని ఒత్తిడి చేశారని తాను కాదనడంతో హీరో ఎన్టీఆర్ కు చెప్పి తనను ఒప్పించారని చివరికి సెన్సార్ కట్ తో ఆ దృశ్యం లేకుండా పోయిందని చెప్పారు. అలాగే 1980 ప్రారంభ దశకంలో సావిత్రి అనారోగ్యంతో మరణించడం గురించి యాంకర్ అడగగా.. మహానటి సావిత్రి చనిపోయారనే వార్త విని తనకు ఎంతో ఆవేశం వచ్చిందని.. ఒక మహానటిగా అద్భుతమైన పాత్రలను ధరించిన సావిత్రి అలా ఎందుకు మరణించారని. తనకు ఆ విషయం ఇంకా అర్థం కాలేదని.. నిజ జీవితంలో విజ్ఞత చాలా అవసరం అని తనకు అనిపించిందని, వ్యక్తిగత జీవితంలో మనస్పర్ధలే ఆమె మరణానికి కారణం కావచ్చు ఏమో అని ఆ ఇంటర్వ్యూలో కృష్ణకుమారి సావిత్రి మరణం గురించి బాధపడుతూ చెప్పడం జరిగింది.