నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సామాజిక విషయాలపై దృష్టి సారిస్తోంది.ఈ క్రమంలోనే పలు విషయాలపై ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎన్నో వివాదాలకు కారణమవుతుంటారు.

తాజాగా ఈ నటి సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసిన పోస్టులు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే మాధవిలత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో బిగ్ బాస్ గురించి తెలియజేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ లో భాగంగా షణ్ముఖ తన లెటర్ ని వదులుకొని నామినేట్ అయ్యారు.అయితే అందులో తన తల్లి గురించి చెబుతూ భావోద్వేగమైన సంగతిని మాధవీలత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ షణ్ముఖ గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే మాధవీలత మాట్లాడుతూ ఇలాంటి వాళ్లకుఎదురుగా మాట్లాడటం చేతకాదు గాని పక్కన ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఎంత చించుకున్నా కాకి-కోకిల కాలేదు కదా సోఫా స్టార్ అంటూ తెలియజేశారు.

అలాగే బిగ్ బాస్ హౌస్ లో భాగంగా కెప్టెన్సీ కంటెంట్ కోసంలో పాల్గొన్నటువంటి ముత్యాల టాస్క్ లో భాగంగా షణ్ముఖ్ ముత్యాలను నీటిగా తీయలేకపోయాడు.ఇదే విషయాన్ని శ్రీరామ్ రవి చెప్పినప్పటికీ సంచాలకులుగా ఉన్నటువంటి సన్నీ డెసిషన్ తీసుకొన్న నిర్ణయం సరికాదంటూ తెలియజేసింది.

హౌస్ లో ఉన్న సిరి తప్ప మిగిలిన అందరూ కూడా లోబోకి ఓటు వేశారు నేను కూడా లోబోకి సపోర్ట్ చేస్తున్నా అంటూ తెలియజేసింది.ఇక హౌస్ లో ప్రవేశించిన సిరి షణ్ముఖ్ కాఫీ కలుపుకొని తాగుదాం చాలా స్ట్రాంగ్ గా కలుపుకుందాం మళ్లీ దొరకదు అంటూ మాట్లాడగా ఈ విషయంపై స్పందించిన మాధవిలత సెల్ఫిష్ అంటూ ఎక్కువ వేసుకోవడానికి ఇదేమైనా మోతిచూర్ లడ్డులోని నెయ్య అంటూ వారి గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇలా షన్ను గురించి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా మాధవీలత పోస్ట్ చేయడంతో వీటిని చూసిన అభిమానులు తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు.ఈ క్రమంలోనే ఆమె గురించి అభిమానులు నెగిటివ్గా మాట్లాడుతూ పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వాటిని స్క్రీన్ షార్ట్ తీసుకున్న మాధవిలత అసలు సిసలైన ఆట ఇప్పుడే మొదలైంది అంటూ షన్ను అభిమానులకు సవాల్ విసిరారు.ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ట్రోలింగ్ నాకు పండగే పెట్టండి ఇలాంటివి చేస్తారో చేయండి మీకు చెర్లోపల్లి కన్ఫామ్ అవి ఎలా ఉండాలి అంటే పదిహేను రోజుల పాటు జైలులో ఉంటూ రెండు సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగే విధంగా మీ మెసేజ్ లు ఉండాలి అంటూ వారికి సవాల్ విసిరింది.

మీరు హర్ట్ అయ్యారు కాబట్టి నాకు వార్నింగ్ ఇచ్చారు. మీరు హర్ట్ అయ్యారు కనుక అసభ్యకర పదజాలంతో నాకు మెసేజ్ లు పెట్టారు అదే నేను హర్ట్ అయితే మీ ప్రొఫైల్స్ సైబర్ జైల్లో ఉంటాయి. నాకు బాగా మండితే మీ మొహాలు చర్లపల్లి జైల్ లో ఉంటాయి అంటూ షన్ను అభిమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది.































