Actress Madhavi Reddy : తెలుగు వెండితెర మీద క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా బుల్లితెర మీద సీరియల్స్ లో కూడా నటించి అభిమానులకు చేరువ అయ్యింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కెరీర్ ఆరంభంలో మాధవి రెడ్డి, ఆర్. నారాయణమూర్తి హీరోగా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. మాధవి రెడ్డి మజిలి, వకీల్ సాబ్ వంటి సినిమాలలో కూడా నటించింది. ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మాధవి రెడ్డి తన కెరీర్ కు సంబందించిన కొన్ని విషయాలు పంచుకున్నారు.

తల్లి పాత్రలు మాత్రమే చేయడానికి కారణం అదే…
మొదట్లో ఒక రెండు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించిన మాధవి రెడ్డి కేవలం తల్లి పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యారు. దానికి గల కారణం గురించి ప్రశ్నించగా నాకు కొన్ని పరిమితులు పెట్టుకున్నాను, నేను ఏదైనా పాత్రలో నటిస్తే దాని వలన నా కుటుంబానికి ఇబ్బంది కలగకూడదని, కేవలం తల్లి పాత్రలు మాత్రమే నటిస్తాను అని ముందే చెప్పేస్తాను అని చెప్పుకొచ్చారు. ఒక వేల సెట్ కి వెళ్ళాక అది నాకు నచ్చక పోయినా నిర్మొహమాటంగా వెనక్కి వచ్చేస్తాను అని చెప్పింది.

మీ కెరీర్ లో అలా వెనక్కి వచ్చిన సంఘటనలు ఉన్నాయా అన్న ప్రశ్నకు చిరంజీవి గారి సినిమాలో ఆయన ముందు పైట జార్చుకునే సన్నివేశం ఒకటి ఉంది అన్నారు, సెట్ కి వెళ్ళాక తెలిసింది వెనక్కి వచ్చేసాను. ఇప్పటికీ అలాంటి క్యారెక్టర్లు వస్తుంటాయి. కానీ నేను అలాంటివి చేయను అని చెప్పేస్తాను అని తెలియజేసారు. ఎక్సపోసింగ్ చేయడం లాంటివి నేను చేయను, నా కూతురుని ఎవరైనా మీ అమ్మగారు ఇలాంటి పాత్రలు చేశారు అని ప్రశ్నించకూడదు అని చెప్పుకొచ్చారు.






























