Actress Priya Raman : కాసేపట్లో షూటింగ్.. తోటి హీరో అని తెలియక శోభన్ బాబుగారిని అంకుల్ అని పిలిచాను.. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారంటే.. : ప్రియారామన్.

0
1377

Actress Priya Raman : భారత్ బంద్ సినిమా ప్రతి కథానాయకుడైన కాస్ట్యూమ్స్ కృష్ణ.. కోడి రామకృష్ణ తీయబోతున్న “మా ఊరి మారాజు” చిత్రంలో నటించడానికి రెండో హీరోయిన్ గా ప్రియారామన్ ని అడగడం జరిగింది. ఆ సమయానికి ప్రియారామన్ తమిళనాడులో ‘వల్లి’ అనే సినిమాలో రజనీకాంత్ ప్రక్కన హీరోయిన్ గా నటించి ఉన్నారు. ఆ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ క్రమంలో మా ఊరి మారాజు చిత్రంలో పొగరుబోతు క్యారెక్టర్ ఉందని అది మీరైతే బాగుంటుందని ప్రియారామన్ కు చెప్పి ‘మా ఊరి మారాజు’ చిత్రంలో నటించడానికి కాస్ట్యూమ్ కృష్ణ ఆమెను ఒప్పించారు. అలా హీరోయిన్ ప్రియారామన్ తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన ‘మావూరి మారాజు’ చిత్రంలో నటించారు.

షూటింగ్ సమయంలో తెలుగు సరిగ్గా రాకపోవడంతో కోడి రామకృష్ణ ప్రియరామన్ చేత డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించారు. ఆ సినిమా తెలుగులో మోస్తారు విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తెలుగులో శ్రీవారి ప్రియురాలు, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభసంకల్పం చిత్రంలో కూడా ప్రియారామన్ నటించారు. అయితే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియరామన్ మాట్లాడుతూ..

1995లో బోయినసుబ్బారావు దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా, నేను హీరోయిన్ గా ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం నేను ఒక ఫ్లైట్ లో చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్నాను. అదే ఫ్లైట్ లో హీరో శోభన్ బాబు కూడా వస్తున్నారు. నా పక్క సీట్లోనే కూర్చున్నారు. ఆయన ఎవరో తెలియక అంకుల్.. అంకుల్ అంటూ పిలిచాను. నన్ను ఆశ్చర్యంగా చూశారు. ఆ తర్వాత నవ్వుకున్నాడు. ఇక దొరబాబు షూటింగ్ విరామంలో మా మమ్మీ తో మీ కూతురు నన్ను ఇందాక వస్తున్న ఫ్లైట్ లో అంకుల్.. అంకుల్ అని పిలిచిందని నవ్వుకుంటూ చెప్పారు.

ఇదివరకు నేను శోభన్ బాబు గారిని చూడలేదు. నా పక్క సీట్లో కూర్చుంది ఎవరో పెద్దాయన అనుకున్నాను. ఆ తర్వాత ఆయనే దొరబాబు చిత్రంలో హీరోగా నటిస్తున్న శోభన్ బాబు గారు అని తెలిసింది. ఆ తర్వాత కూడా నేను చాలా అవాక్కయ్యాను. సెట్లో ఆయన ఎంతో సరదాగా ఉంటారు. నేను తెలుగులో తక్కువ సినిమాలు చేసిన గుర్తుండిపోయే పాత్రలు చేశానని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.