ప్రియమణి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే.. సినిమాలు అవకాశాలు కొంచెం తగ్గినా బుల్లి తెరపై మాత్రం జడ్జిగా అందరినీ అలరిస్తోంది. అందం తో పాటు అభినయం కలగలిసిన అద్బుతమైన నటి ప్రియమణి. ఒక జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ, తాజగా ఇంస్తాగ్రాం లో ఒక ఫోటో షేర్ చేసింది.

ఈ క్రమంలో ఒక ఆకతాయి నెటిజన్ న్యూడ్ ఫోటో షేర్ చేయమని అడిగాడు. దీనికి దిమ్మతిరిగే సమాధానం చెప్పింది ప్రియమణి. “ముందు నీ సోదరి లేదా అల్లిది అలాంటి ఫోటో అడిగి షేర్ చెయ్, అప్పుడు నేను కూడా పెడతా” అంటూ జవాబిచ్చింది. షాక్ అయిన ఆ నెటిజన్ క్షమాపణలు కోరాడు. ప్రియమణి ఇచ్చిన రిప్లై కి అందరూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.



























