Actress Rambha: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి రంభ ఒకరు. ఈమె తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో అద్భుతమైన హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈమె జేడీ చక్రవర్తి జంటగా నటించిన బొంబాయి ప్రియుడు అప్పట్లో ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇకపోతే రంభ వివాహం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నటుడు జేడీ చక్రవర్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్నేహితులు ఉన్నారని అలాంటి వారిలో జెడి చక్రవర్తి చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే తన పెళ్లికి జేడీ చక్రవర్తిని ఆహ్వానించిన తను మాత్రం నా పెళ్ళికి రాలేదు. ఆ విషయంలో మేము చాలా బాధపడి అప్సెట్ అయ్యామని రంభ తెలిపారు.

Actress Rambha నా పెళ్ళికి రాలేదు…
జెడి చక్రవర్తికి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే విషయంలో చాలా అబద్దాలు చెబుతాడు. తాను పెద్ద అబద్దాలకోరు అంటూ రంభ జేడీ చక్రవర్తి గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి రంభ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.సినిమాలు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేశారు.



























