టెలివిజన్ మరియు సినిమాల్లో సక్సెస్‌ఫుల్ కెరీర్ అందుకున్న నటీమణి సత్యశ్రీ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో గడిపిన కొన్ని మధుర క్షణాలను పంచుకుంది. జబర్దస్త్ ద్వారా ప్రాచుర్యం పొందిన సత్యశ్రీ, ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి పట్ల తన అభిమానం, ఆయనతో కలిసిన ప్రతి అనుభవాన్ని ఆమె ఎంతో భావోద్వేగంగా చెప్పుకున్నారు.

సత్యశ్రీ చెప్పినట్లుగా, “తేజ్ ఐ లవ్ యు” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవిని తొలిసారి కలిశానని ఆమె వెల్లడించింది. “ఆయన నన్ను ఏం పేరు? ఏ పాత్ర చేశావు? అని అడిగారు. నేను ఒక్క సెల్ఫీ కావాలని అడిగితే, ఆయన ‘ఓకే’ అన్నారు. కానీ వెంటనే ఆయనను పిలిచారు, తర్వాత స్పీచ్ ఇచ్చారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత, చాలా మంది ఇతరులకు మర్చిపోతారు. కానీ చిరంజీవి గారు స్పీచ్ తర్వాత నా దగ్గరకు వచ్చి, ‘ఇందాక ఫోటో అడిగింది నీవే కదా?’ అని గుర్తు పెట్టుకుని సెల్ఫీ ఇచ్చారు. అప్పుడే నా కన్నీళ్లు తెప్పించి, నేను ఎమోషనల్ అయిపోయాను” అని సత్యశ్రీ వివరించారు.
తర్వాత, వాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో ‘సుమ అడ్డా’ షోలో చిరంజీవిని మళ్లీ కలిసినప్పుడు, తన తండ్రి రచించిన కవిత్వాన్ని ఆయనకు అందించానని చెప్పింది. “నా నాన్నగారు చిరంజీవి సినిమాల పేర్లతో ఓ కవిత రాశారు. దాన్ని ఫ్రేమ్ చేసి ఆయనకు ఇచ్చాను. ఆయన ఎంతో ఆనందపడ్డారు. ‘నా ఆఫీస్‌లో పెట్టుకుంటాను’ అని చెప్పారు.”
పద్మ విభూషణ్ అవార్డు పొందిన సమయంలో, మరొకసారి చిరంజీవిని కలిసిన సత్యశ్రీ, వేంకటేశ్వరస్వామి ఇత్తడి విగ్రహాన్ని ఆయనకు బహుకరించానని చెప్పింది. “ఆయన దాన్ని బెంగళూరు గెస్ట్ హౌస్‌లో ఉంచుతానని చెప్పారు. ఆ సందర్భంలో నేను నా అమ్మను కూడా తీసుకెళ్లాను. ఆమె చిరంజీవిని చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. చిరంజీవి గారు ఆమెను చూసి, ‘సుమ అడ్డాలో కలిశాం కదా’ అని గుర్తు పెట్టుకున్నారు. ఆ క్షణం నాకు చిరంజీవి గారి కోసం జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకం.”
చివరగా సత్యశ్రీ చెప్పింది, “చిరంజీవి గారు మా కుటుంబానికి దేవుడి లాంటివారు. ఆయనలో ఉన్న వినయం, ఆత్మీయతే ఆయన గొప్పతనాన్ని చాటుతుంది.”



























