Actress Shanoor Sana Begum : హీరోయిన్ అవ్వాలంటే ఎక్సపోసింగ్ చేయాలన్నారు…పెళ్లి, పిల్లల గురించి అపద్దాలు చెప్పాలని అన్నారు… బుర్కా వేసుకోలేదని అవమానించారు…: నటి షానూర్ సన బేగం

0
228

Actress Shanoor Sana Begum : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి సన బేగం. మోడల్ గా అడుగుపెట్టిన ఆమె ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాలో బెనర్జీ వైఫ్ గా క్యారెక్టర్ చేసి తెలుగులో మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక ‘చక్రవాకం’ సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయిన సన అటు సీరియల్స్ ఇటు సినిమాలు చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన లైఫ్ ని వ్లాగ్స్ చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ అన్ని విశేషాలను పంచుకున్నారు.

హీరోయిన్ అవకాశాలు అందుకే వద్దనుకున్నా…

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన సన గారు మొదటి ప్రయత్నంలోనే మంచి అవకాశాలాను అందుకున్నారు. అయితే హీరోయిన్ గా ప్రయత్నించలేదా అంటే హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా ఎక్సపోసింగ్ విషయంలో వద్దానుకున్నాను. ఇక మరికొన్ని సినిమాలు కథ నచ్చక వద్దనుకున్నా అంటూ తెలిపారు. మోడలింగ్ లోనూ సినిమాల్లోనూ నటించే సమయానికే పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉండగా చాలా మంది సినిమాల్లోనూ యాడ్ షూటింగ్స్ అపుడు పెళ్లి అయిందని పిల్లలు ఉన్నారని చెప్పకండి అనేవారు. అలా చెబితే అవకాశాలు పోతాయని చెప్పేవారు. కానీ నేనెందుకు దాచాలి అనుకునేదాన్ని అంటూ చెప్పారు.

ఇక ఇంట్లో అత్తమామలు నేను మోడలింగ్ చేస్తానని చెప్పినపుడు ఒప్పుకున్నారు. తాను అన్ని సార్లు అడుగుతోంది అదేంటో చూడు అని మామగారు చెప్పేవారు. ఇరుగు పొరుగు వాళ్ళు మీ కోడలు బుర్కా వేసుకోదు మోడలింగ్ చేస్తోంది అంటూ అవమానించేలా మాట్లాడినా మామ గారు తాను గౌరవప్రదంగా పనిచేసినంత వరకు మాకు అభ్యంతరం లేదు, మీ ఇంట్లో ఎవరికన్నా పని కావాలంటే నా కొడలికి చెబుతాం చూస్తుంది అని అనేవారట. అలా అత్తింటి వారి సపోర్ట్ వల్లే కెరీర్ లో ముందుకు వెళ్ళగలిగాను, షూటింగ్స్ అపుడు అత్తగారు వెంట వచ్చేవారు అంటూ చెప్పారు సన.