టాలీవుడ్ లో నటి శ్రియ ఒకపుడు ఓ టాప్ హీరోయిన్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసి.. అక్కడా అవకాశాలు తగ్గడంతో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అయిన ఆండ్రీ కొస్చీవ్‌ను 2018 లో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయింది శ్రియ. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోలందరి సరసన శ్రియ నటించింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె క్రేజ్ బాగా తగ్గింది. తెలుగులో నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం తర్వాత మరే చిత్రంలోనూ కనిపించలేదు ఈ ముదరు భామ. పెళ్లి తర్వాత శ్రియ భర్తతో కలిసి ఎక్కువగా విదేశాల్లోనే ఉంటుంది. లాక్‌డౌన్ టైంలో ఈ జంట స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంది. కరోనా మహమ్మారి వల్ల లాక్‌డౌన్ విధించడంతో శ్రియ దంపతులు బార్సిలోనాలో చాలా రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఆ వార్తలన్నీ ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరలైన సంగతి విదితమే.
అయితే తాజాగా ఈ బ్యూటీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న అదేంటో శ్రియకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ ప్రస్తుతం మాత్రం ‘రాజమౌళి R.R.R’ చిత్రంలో అజయ్ దేవ్‌గన్ కు జోడీగా నటిస్తుంది ఈ బ్యూటీ.

ఇక అసలు విషయానికి వస్తే.. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో శ్రియకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోను షేర్ చేశారు. అయితే అందులో శ్రియ పై తనూజ్ చేయివేసి ఆమెపై వాలిపోయి ఉన్నారు. అయితే ఏంటి.? ఈ ఫోటో ఇంతలా వైరల్ కావడానికి కారణం ఏమిటనే కదా.. మీ సందేహం.! ఈ ఫోటోలో వాళ్ళిద్దరూ ఉన్న తీరు ఒకటైతే.. ఆ ఫోటోకు తగినట్లుగా ఆయన ఇచ్చిన క్యాప్షన్ మరో హైలెట్. అదేంటంటే.. ”అప్పటి తాగిన మత్తులోని రాత్రులు” అనే క్యాప్షన్ రాసి ఉండటంతో పాటు.. ఆ ఫొటో తీసిన ఊరు, అందులో వాళ్ళిద్దరూ ఉన్న తీరు, ఆ ఫోటోకి ఆయన పెట్టిన పేరు కారణంగానే ఆ ఫోటో అంతలా వైరల్ అయ్యిందని చెప్పవచ్చు. పాపం.. ఈ ఫొటోను శ్రియ భర్త చూస్తే ఎలా ఫీలవుతాడో అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.




























