Urvashi Rautela: సాధారణంగా సెలబ్రెటీలు అంటే మీడియా అటెన్షన్ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వారు ఏంచేస్తున్నారు…ఎటు వెళ్తున్నారు.. వారి లైఫ్ స్టైల్, ఫ్యామిలీ విషయాలు ఇలా అన్నింటిపై ప్రజలకు ఆసక్తి ఉంటుంది కాబట్టి మీడియా కూడా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇది సినీ రంగంలో ఉన్నవారిపై మరింతగా ఎక్కువగా ఉంటుంది.

నటినటుల కనిపిస్తే చాలు కెమెరాలతో క్లిక్ మనిపిస్తుంటారు. వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నయంటూ.. చాలా సార్లు సెలబ్రెటీలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఊర్వశీ రౌతేలా మెడ మీద ఎర్రటి మరక కనిపించింది. ఇక దీన్ని క్యాప్చర్ చేసిన ఓ వెబ్ సైట్.. తనకు నచ్చిన విధంగా హద్దులు దాటేసి ఊర్వశి మెడపై లవ్ బైట్ అంటూ.. రాసేసింది.

ఇది చూసిన ఊర్వశి ఘాటుగానే స్పందించింది. సదరు వైబ్ సైట్ న్యూస్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికపై ఈ కథనంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సోషల్ మీడియా వేదకగా ఊర్వశి ఆగ్రహం..
‘హాస్యాస్పదంగా ఉంది! అది నా రెడ్ లిప్‌స్టిక్, మాస్క్ తీస్తూ పెడుతున్నప్పుడు అది నా మెడకు అంటింది. పెదాలకు రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకున్న తర్వాత దాన్ని మెయింటెన్ చేయడం ఎంత కష్టమో ఏ అమ్మాయిని అడిగినా చెప్తుంది. ఒకరి ప్రతిష్టను దిగజార్చడం కోసం ఏదిపడితే అది రాస్తారా? ఇలాంటి ఫేక్ న్యూస్‌లు రాసే బదులు నా విజయాల గురించి రాయొచ్చు కదా?’ అని ట్వీట్ చేసింది. అంతేకాదు ఈ అసత్య ప్రచారం చేసినందుకుగానూ తనకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేసింది. ఊర్వశి 2013లో సింగ్ సాబ్ ద గ్రేట్ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంతి వంటి పలు చిత్రాల్లో నటించింది. ఆమె చివరగా వర్జిన్ భానుప్రియ సినిమాలో కనిపించింది.





























