Actress Yamuna : సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటి యమునా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మౌన పోరాటం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యమున ఆ తర్వాత తెలుగు,తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో హీరోయిన్గా నటించి గుర్తింపు పొందింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ సీరియల్స్ లో కూడా కీలక పాత్రలలో నటించి అటు బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో యమున కీలక పాత్రలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యమునా 2011లో బెంగళూరులో ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిందనే వార్త ఇప్పటికీ వైరల్ అవుతోంది. దీని గురించి పలు సందర్భాల్లో, పలు వేదికల మీద యమున చెప్పు కొచ్చింది. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎన్నో అసభ్యకరమైన వార్తలు రావటంతో యమున ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికీ ఈ సంఘటనకు సంబంధించి చాలా దారుణమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో యమున ఆ సంఘటన గురించి మాట్లాడుతూ..” నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా సోషల్ మీడియా వల్ల తెలియని ఓ బాధ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితమే ఓ సమస్య నుంచి బయట పడి ప్రశాంతంగా ఉంటున్నాను. అంతే కాకుండా ఆ సమస్యలో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాను అంటూ తెలిపింది.

Actress Yamuna :నేను చనిపోయిన వదిలిపెట్టరు…
అంతే కాకుండా…ఆ విషయంలో న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది. న్యాయ పరంగా నేను విజయం సాధించి ప్రశాంతంగా ఉందామనుకుంటున్నప్పటికి… ఈ సోషల్ మీడియా వల్ల ప్రతిరోజు బాధ పడుతున్నా. సోషల్ మీడియాను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పటికి కూడా నా గురించి, ఆ సంఘటన గురించి రకరకాల థంబ్‌నెయిల్స్, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అవి నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో నన్ను ఎంత నేను మోటివేట్ చేసుకున్నా.. ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఆ థంబ్‌నెయిల్స్ చూస్తే.. నేను చనిపోయినా కూడా నన్ను వీళ్లు వదలరు అనిపిస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది యమున. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.





























