Adavi Shesh : ‘కర్మ’ సినిమాతో తొలిసారి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అడవి శేష్ మొదట పదిహేను ఏళ్ల వయసులో తొలిసారి సొంతం సినిమాలో నటించాడు. ఇక డైరెక్టర్ గానూ రైటర్ గానూ తన సినిమా కథలను తానే మలుచుకునే అడవి శేష్ గూడాచారి, క్షణం, మేజర్ వంటి చిత్రాలతో హిట్లని మాత్రమే కాకుండా అభిమానులను కూడా పెంచుకున్నాడు. ప్రస్తుతం హిట్ సినిమా సీక్వెల్ లో నటిస్తున్న అడవి శేష్ ఈ సినిమాను అన్ని భాషలలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పూజ తో ముద్దు అందుకే వద్దన్నాను…
ఇటీవలే అన్ స్టాపబుల్ షోకి శర్వానంద్ తో పాటు వచ్చిన అడవి శేష్ సరదాగా కబుర్లు చెప్పి ఎంటర్ టైన్ చేసాడు. ఇక శేష్ ప్రతి సినిమాలోనూ హీరోయిన్ తో లిప్ కిస్ సీన్ ఖచ్చితంగా ఉంటుంది. మొదటి సినిమా నుండి ఇదో సెంటిమెంట్ గా వస్తోంది. అయితే ఇదే విషయం మీద బాలయ్య బాబు ప్రశ్న అడిగారు. మొదట కిస్ చేసిన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నతో మొదలు ఎవరిని కిస్ చేయాలని ఉంది వంటి ప్రశ్నలను అడిగారు.

ఎవరిని కిస్ చేయకూడదని అనుకుంటున్నావు అని అడిగేసరికి శేష్ పూజా హెగ్డే పేరు చెప్పాడు. దీంతో ఈ సమాధానం వైరల్ అయింది. ఇక రీసెంట్ గా ‘హిట్ 2’ సినిమా ప్రచరాల్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్ కి ఈ ప్రశ్న ఎదురైంది. ఎందుకు పూజ పేరు చెప్పారు అని ప్రశ్న అడిగితే నేను ఎదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి ఇంత వరకు పూజా హెగ్డే తో నటించలేదు కాబట్టి ఆ పేరు చెప్పాను దానికి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు పెద్ధగా రీజన్స్ ఎం లేవ్ అంటూ చెప్పారు.






























