Adhire Abhi : ‘ఈశ్వర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అభినయ కృష్ణ, జబర్దస్త్ కి వచ్చాక అదిరే అభిగా అందరికీ సుపరిచితుడయ్యడు. అదిరే అభి సినిమాల్లో చేస్తూనే జబర్దస్త్ కూ వచ్చాడు. ఇక అలాగే ‘బాహుబలి’ సినిమాకు రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. అదీ కాక మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షో కోసం క్రియేటివ్ హెడ్ గా కూడా పనిచేసారు. అయిన ఎప్పుడూ జబర్దస్త్ ను వీడలేదు. కానీ ప్రస్తుతం కారణాలు తెలియవు కానీ జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. అయితే అభి సినిమాల్లో కూడా చేస్తున్నారు, అలాగే సినిమా తీస్తున్నారు కూడా.

ఆ స్కిట్ చేయకుండా ఉండి ఉంటే బాగుండేది…
అదిరే అభి తన జబర్దస్త్ కెరీర్ లో ఎన్నో స్కిట్స్ చేసి జనాలను నవ్వించారు. అయితే డబల్ మీనింగ్ డైలాగులు అలాగే, మరొకరిని కొడుతూ చేసే హాస్యానికి దూరంగా ఉన్నాడు. ఇన్నేళ్ల స్కిట్స్ లో ఎన్నో వెరైటీ స్కిట్స్ ను జబర్దస్త్ కు అందించారు అభి. అయితే ఇన్నేళ్ల జబర్దస్త్ కెరీర్ లో ఒక స్కిట్ మాత్రం చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని అనిపించిందట.

తాను ఎపుడూ వల్గర్ స్కిట్స్ చేయలేదు కానీ ఒకసారి మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధిచిన ఒక పెద్ద వ్యక్తిని అనుకరించి స్కిట్ చేసాం. అయితే ఆ స్కిట్ వల్ల ఆ వ్యక్తిగత బాగా హర్ట్ అయ్యాడు. మేము ఆ స్కిట్ తో హర్ట్ చేశామని అనిపించింది అంటూ అభి తెలిపారు. ఆ స్కిట్ చేసాక అనిపించింది చేయకుండా ఉంటే బాగుండేది అని అంటూ చెప్పారు.






























