Adipurush Prerelease event : సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్స్ గా మిగలడంతో నెక్స్ట్ వస్తున్న డార్లింగ్ సినిమాల మీద అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. కసిగా డార్లింగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ బాహుబలి అంత రేంజ్ లో హిట్ కొట్టి సత్తా చూపాలని ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని భారీ బడ్జెట్ సినిమాలు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా సలార్, మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే, ఇక ఓం రౌత్ దర్శకత్వంలో అధిపురుష్. అన్ని పెద్ద ప్రాజెక్ట్ లే అలాగే పాన్ ఇండియా సినిమాలే. ఇక ఇందులో రెండేళ్ల నుండి ఉరిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆఖరికి ఈ సినిమా విడుదల కాబోతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే…
ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పత్రాల్లో నటిస్తున్న ఈ సినిమా గ్రాఫిక్స్ బాగోలేవని టీజర్ విడుదల అయ్యాక బాగా ట్రోల్స్ నెగెటివ్ కామెంట్స్ రావడంతో డైరెక్టర్ ఓం రౌత్ మరింత సమయం తీసుకుని సినిమాను తీశారు. అలా ఇప్పటికి ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయిన మ్యూజిక్ అలాగే టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

తాజాగా తిరుపతి తారకరామ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా అభిమానులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగిందని, ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయి మరో బాహుబలి రేంజ్ హిట్ ప్రభాస్ కి వస్తుందంటున్నారు. ఇక ఈ ఈవెంట్ కి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిధి గా రానున్నారు. ఇక ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధి గా ఈ ఈవెంట్ లో కనువిందు చేయనున్నారు.



























