Adiseshagiri Rao : సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాత్మక సినిమాలను ఆ రోజుల్లోనే చేసి ప్రేక్షకాదరణ పొందారు. బుర్రిపాలెం నుండి చెన్నై వెళ్లి తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కృష్ణ ఆ తరువాత తెలుగులో మొదటి సారి హాలీవుడ్ మెకనస్ బంగారం కోసం కౌబాయ్ లా వేట ను సినిమాగా తీసేవారు, ఆ సినిమాలను తెలుగుకు పరిచయం చేసారు సూపర్ స్టార్ కృష్ణ. కొత్తదనాన్ని తెలుగు తెరకు పరిచయం చేసింది కృష్ణగారే. ఇక కృష్ణ గారు విజయనిర్మల గారి జంట అటు వెండి తెర మీద ఎంత ఫేమస్ అయిందో, నిజ జీవితంలో కూడా అంతే ఫేమస్. 1969 లో వారిద్దరూ ఒక్కటయ్యారు.

పెళ్ళికి ఇందిర గారిని ఎవరు ఒప్పించారు…
ఇక అప్పటికే పెళ్ళైన సూపర్ స్టార్ కృష్ణ గారికి పిల్లలు ఉన్నారు. అయితే విజయ నిర్మల గారితో ఎక్కువ సినిమాలు తీయడంతో పరిచయం ప్రేమగా మారి ఎవరికీ చెప్పకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఇంట్లో వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసారు. ఈ విషయంపై ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందిస్తూ ఆయన వ్యక్తిగత నిర్ణయం, అయితే కొంత కాలం మా అమ్మగారు అంగీకరించలేక పోయారు. ఆ తరువాత సర్దుకుపోయారు. ఇక వదిన ఇందిర గారితో నేను చనువుగా ఉండేవాడిని ఆమెను ఒప్పించాల్సి వచ్చింది. అయితే కృష్ణ గారికి విజయ నిర్మల గారు చాలా చేదోడు వాదోడుగా ఉండేవారు. కెరీర్ లో సహకరిస్తూ ఉండేవారు.

ఇక కృష్ణ గారు కూడా విజయనిర్మల గారిని చాలా ప్రోత్సహించేవారు. ఆవిడ డైరెక్టర్ గా తీసిన మీనా వంటి సినిమాల్లో నటించారు. అలా ఆమె దాదాపు 40 చిత్రాలను తెలుగులో దర్శకత్వం వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇక 2019లో విజయనిర్మల గారు గుండె పోటుతో మరణించే దాకా కృష్ణ గారి వెంటే ఉన్నారు. అయితే విజయనిర్మల గారు కృష్ణ గారి సొంత బ్యానర్ లో పద్మాలయ బ్యానర్ లో ఒక్క సినిమా కూడా దర్శకత్వం వహించలేదు. ఆమె సొంత బ్యానర్ విజయకృష్ణ లో మాత్రమే సినిమాలను తీశారు. ఈ విషయాలను కృష్ణ సోదరుడు పద్మాలయ నిర్మాణ సంస్థ పనులు చూసుకునే ఆదిశేషగిరిరావు గుర్తుచేసుకున్నారు. ఇక భారీ బడ్జెట్ సినిమాల గురించి మాట్లాడుతూ హీరోలే ప్రొడ్యూసర్స్ అయితే ఇన్ని రోజులు షూటింగులు ఉండవు, ఇంత బడ్జెట్లు ఉండవు అంటూ మాట్లాడారు.
































