Adusumilli Srinivasarao : ఏపీ రాజకీయాల గురించి ప్రస్తుతం చర్చ ఎక్కువ జరుగుతోంది. ఒక వైపు విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వవ్యతిరేకత పెరుగుతోంది అంటూ ఓ వైపు వినిపిస్తోంది. నిజానికి ఏపీ లో ఎలక్షన్ వచ్చే ఏడాది ఉన్నా అప్పుడే రాజకీయ పార్టీలు వ్యూహలకు పదును పెట్టాయి. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకులను సంఘటితం చేసుకోడానికి ప్రతిపక్షాలు పావులు కాదుపుతుంటే మరో వైపు అధికార పార్టీ చేసిన పనులకు ప్రజలలో మరింత ప్రచారం చేసుకుంటున్నారు. ఇక నేటి రాజకీయ పరిస్తుతుల గురించి పొలిటికల్ అనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాస రావు గారు మాట్లాడారు.

ఐఏఎస్ ల చూపు చంద్రబాబు వైపు…
రాజకీయాల్లో బ్యూరోక్రాట్ల మద్దతు ఏ పార్టీకైనా బలం, ఉద్యోగస్థులు ప్రభుత్వం వైపు ఉన్నారా లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారా అన్నది ఆ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి దోహద పడుతుంది. పోయిన సారి ఎన్నికల సమయంలో ఐఏఎస్ లు ప్రభుత్వ ఉద్యోగులు జగన్ కి సపోర్ట్ చేయడం విజయానికి కొంత దోహద పడింది. అయితే ప్రస్తుతం మాత్రం ఉద్యోగస్థులు జగన్ సర్కార్ మీద అసంతృప్తితో ఉన్నారు అన్నది వాస్తవం అంటూ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు అభిప్రాయపడ్డారు.

ఉద్యోగస్థులు తమ నోట్లో తామే మట్టికోట్టుకున్నట్లు భావిస్తుండగా జగన్ కు మద్దతు ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ లందరూ ఇప్పుడు రహస్యంగా చంద్రబాబు ను కలుస్తున్నారు అంటూ ఆయన తెలిపారు. ఈ పరిస్థితులు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలుపుతాయి. ఉద్యోగస్థులకు ముఖ్యంగా రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ప్రజలకు దగ్గరగా ఉంటారు కాబట్టి ప్రజల పల్స్ వారికి బాగా తెలుస్తుంది అందుకే ఉద్యోగస్థులు ఎవరి వైపు ఉన్నారో వాళ్లకు గెలిచే అవకాశాలు ఎన్నికల్లో ఎక్కువ ఉంటాయి అంటూ తెలిపారు. ఏపీ లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ తెలిపారు.




























