మొదటి డోసు కోవీషీల్డ్ వేసుకున్నాక.. రెండవ డోస్ కొవాగ్జిన్‌ వేయించుకుంటున్నారా..?

గత ఏడాది నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధకులు వ్యాక్సిన్ కనుక్కొని ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ “కోవీషీల్డ్”, “కొవాగ్జిన్‌” వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ మనం రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ వేయించుకున్న నాలుగు వారాల నుంచి 12 వారాల లోపు రెండో డోస్ వేయించుకోవాలి. ఈ క్రమంలోనే వైరస్ ని ఎదుర్కొనే యాంటీబాడీలు మన శరీరంలో ఉత్పత్తి అయి వైరస్ నుంచి మనల్ని రక్షిస్తాయి.

అయితే చాలా మందిలో వ్యాక్సిన్ పట్ల ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని? కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తోందని భావిస్తుంటారు. అదేవిధంగా మరికొందరు మొదటి డోస్ “కోవీషీల్డ్”వేయించుకున్న తరువాత రెండవ డోస్ “కొవాగ్జిన్‌” వేయించుకోకూడదని అలా వేయించుకోవడం వల్ల ప్రమాదాలు మరింత అధికం అవుతాయని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారంటే..

కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు కోవీషీల్డ్ తీసుకున్నవారు రెండవ డోసు కొవాగ్జిన్‌ తీసుకుంటే ఎలాంటి ప్రమాదాలు సంభవించవని, ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మొదటి డోసుకోవీషీల్డ్ తీసుకొని రెండవ డోసు కొవాగ్జిన్‌ తీసుకుంటే వ్యాక్సిన్ ప్రభావం మన శరీరంలో ఏ మాత్రం పని చేయదు. ఈ విధంగా మొదటి డోసు కోవీషీల్డ్ తీసుకొని, రెండవ డోసు కొవాగ్జిన్‌ తీసుకున్న వారు తిరిగి మరో నాలుగు వారాల తర్వాత రెండవ డోసు కొవాగ్జిన్‌ తీసుకోవటం వల్ల ఈ వ్యాక్సిన్ మన శరీరంలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకానీ ఎలాంటి ప్రమాదాలకు దారి తీయదని నిపుణులు తెలియజేస్తున్నారు.