ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ స్టార్స్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, వోవియా, అజయ్ దేవగన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ కు చాలా డామేజ్ జరిగిందన్న సంగతి తెలిసిందే.

దీంతో సినిమా కూడా విడుదల వాయిదా కానుందని సమాచారం. ఈ విషయం నిర్మాత డి వి వి దానయ్య కూడా క్లారిటీ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ జనవరి 2021లో వచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే కొంతవరకు క్లారిటి వచ్చింది. అయితే ఇప్పుడు అనుకున్నట్టుగా జనవరి 8 న రిలీజ్ చేయలేకపోయినప్పటికి వీలైనంత తొందరలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరీ ఆలస్యం అయితే మాత్రం సినిమా మీద భారీగా ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. ఇక ప్రొడక్షన్ కాస్ట్ కూడా భారీగా పెరగొచ్చు.

అందుకే ఇటీవల ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో రాజమౌళి షూటింగ్స్ పునఃప్రారంభం గురించి మాట్లాడారు. తగు జాగ్రత్తలతో షూటింగ్స్ మొదలు పెట్టాల్సిందే అని క్లియర్ గా చెప్పారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విషయంలో ఇప్పుడు భారీ సిబ్బంది.. నటులతో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించలేం కాబట్టి తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ పాల్గొనే సన్నివేశాలు తెరకెక్కించే విధంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here