శుభవార్త చెప్పిన ఎయిర్ ఇండియా… !! త్వరలో బుకింగ్స్ పునఃప్రారంభం..!!

0
300

కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీనితో దేశవ్యాప్తంగా విమానయాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. కాగా విమాన సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో అని విమాన ప్రయాణికులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.. అయితే మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విమాన సర్వీసులు తిరిగి ఎప్పుడు మొదలవుతాయి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు..

ఈ క్రమంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొంతమేరకు స్పష్టతనిచ్చింది. అయితే ఎయిర్ ఇండియా దేశీయ సర్వీసులకు సంబంధించి బుకింగ్స్ మే 4 నుంచి మొదలవుతాయని ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్ జూన్ 1 నుంచి మొదలవుతాయని స్పష్టం చేసింది. అయితే ఏ ఏ నగరాలకు విమాన సర్వీసుల బుకింగ్స్ పునః ప్రారంభమవుతాయి అనే విషయంపై ఎయిర్ ఇండియా ఇంకా స్పష్టం చేయలేదు.

కాగా లాక్ డౌన్ సమయంలో విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి విమానాలు రద్దు కావడంతో వారికి టికెట్ అమౌంట్ మొత్తం రేఫండ్ చేయాలని ప్రభుత్వ, ప్రయివేటు విమానయాన సంస్థలను డెప్యూటీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here