ప్రయాణికులకు షాకిచ్చాయి విమానయాన సంస్థలు. లాక్ డౌన్ ఎఫక్ట్ తో విమానయాన సంస్థలు భారీ నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆ బాధలో విమానయాన కంపెనీలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. “ప్రియమైన వినియోగదారులారా.. మీరు కొన్న టికెట్లకు రిఫండ్ ఇవ్వబడవు” అంటూ హెచ్చరిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఏప్రిల్ 14 తో ముగుస్తునని భావించిన లాక్ డౌన్ కాస్త మే 3వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం ఈ క్రమంలో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు కూడా రద్దు చేసింది. ఏప్రిల్ 14 తరువాత ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వారంతా ఫ్లయిట్స్ రద్దవడంతో రిఫండ్ ఇస్తారని భావించారు.

కానీ ఎయిర్ లైన్స్ సంస్థలు మాత్రం వారి ఆశల మీద నీళ్లు చల్లుతున్నాయి. ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు బుకింగ్స్ అన్ని రద్దు చేశాయి. రద్దైన బుకింగ్స్ డబ్బులు రిఫండ్ ఇచ్చేది లేదని వెల్లడించాయి. అయితే టికెట్స్ తీసుకున్న వారందరు వాటిని తరువాత ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నాయి. ఈ టిక్కెట్లను 28 ఫిబ్రవరి 2020 వరకు వాడుకోవచ్చని సూచిస్తున్నాయి స్పైస్ జెట్ వంటి సంస్థలు. అయితే ఇండిగో, విస్తారా వంటి సంస్థలు మాత్రం 31 డిసెంబర్ 2020 వాడుకోవచ్చని తెలిపాయి.




























