Ajay Devagan & Kicha Sudeep : సౌత్ సినిమాల జోరు బాలీవుడ్ లో చిచ్చు రేపుతోంది. బాహుబలి తో మొదలై ఇక ఇపుడు కేజీఎఫ్ 2 వరకు పాన్ ఇండియా సినిమాలుగా బాలీవుడ్ విడుదలయి బాలీవుడ్ సినిమాలకు కాక పుట్టించాయి. ఇక బాలీవుడ్ సినిమాలపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇక బాలీవుడ్ లో కంటెంట్ ఉన్నా సినిమాలు రావడంలేదు అనే విమర్శ బాలీవుడ్ సెలబ్రిటీస్ ను ఇపుడు చికాకు పెడుతోంది. నిజానికి బాలీవుడ్ లో కంటెంట్ ఉన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు ది కాశ్మీరి ఫైల్స్, దస్వి లాంటి సినిమాలే నిదర్శనం. కానీ చాలా వరకు టాప్ హీరో సినిమాలంతా మూసగా సాగే యాక్షన్ సినిమాలే. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులు పక్కా చూపులు చూస్తున్నారు. డబ్బింగ్ సినిమాల పుణ్యమా అని సౌత్ సినిమాల జోరు ఉత్తరాదిన పెరిగింది.

హిందీ జాతీయ భాష….
ఇక కేజీఎఫ్ 2 రచ్చ మాములుగా లేదు. కన్నడ సినిమా బాలీవుడ్ ను ఊపేసింది. ఇక ఈ విషయాన్నే కిచ్చా సుదీప్ తన సినిమా విక్రాంత్ రోణా ప్రమోషన్స్ లో భాగంగా కేజీఎఫ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆ సమయంలోనే హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది. తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారు. కానీ అవి అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. కానీ ఈరోజు మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయి.’ ఇక ఈ వాఖ్యలు ఇపుడు దుమారం లేపాయి.
I love and respect every language of our country sir. I would want this topic to rest,,, as I said the line in a totally different context.
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
Mch luv and wshs to you always.
Hoping to seeing you soon.
????????????????????????
ఇక ఈ వాఖ్యలకు స్పందించిన అజయ్ దేవగన్ హిందీ జాతీయ భాష కానపుడు ఎందుకు మీ సినిమాలను హిందీ లో డబ్ చేస్తున్నారు అంటూ ట్వీట్ చేసారు.హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను ప్రశ్నించాడు. ఇక ఈ వివాదం హద్దు దాటుతుందేమో అని అనుకున్నారేమో సుదీప్ వెంటనే విషయాన్నీ సద్దుమనిగించే ప్రయత్నం చేసారు.హలో అజయ్ సార్. నా వ్యాఖ్యలకు అర్థం అది కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వ్యక్తిగతం కలిసినప్పుడు దీనికి మీకు వివరణ ఇస్తాను’ అని చెప్పుకొచ్చాడు.
And sir @ajaydevgn ,,
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi.
No offense sir,,,but was wondering what'd the situation be if my response was typed in kannada.!!
Don't we too belong to India sir.
????
మరో ట్వీట్‌లో భారతదేశంలోని అన్ని భాషలపై తనకు గౌరవం ఉందని, ఇక్కడితో ఈ టాపిక్‌ను వదిలేయాలనుకుంటున్నాను అంటూ సుదీప్ వరస ట్వీట్స్ చేశాడు. ‘ఎలాంటి అపార్థాలు చోటు చేసుకోకుండా దీనికి స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు మై ఫ్రెండ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం అని నా అభిప్రాయం. మనమంతా దేశంలోని అన్ని భాషలను గౌరవించాలి’ అంటూ సుదీప్ ట్వీట్‌కు అజయ్ రిప్లై ఇచ్చాడు. ఇక ఇక్కడితో ఈ వివాదం ముగిసినట్టే అనిపిస్తోంది.
Translation & interpretations are perspectives sir. Tats the reason not reacting wothout knowing the complete matter,,,matters.:)
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022
I don't blame you @ajaydevgn sir. Perhaps it would have been a happy moment if i had received a tweet from u for a creative reason.
Luv&Regards❤️ https://t.co/lRWfTYfFQi



























