Ajay Ghosh : ‘పుష్ప’ సినిమాలోని ‘కొండా రెడ్డి’ పాత్రతో బాగా పేరు తెచ్చుకున్నారు అజయ్ ఘోష్. ఈయన 2010 లో విడుదల అయిన ‘ప్రస్థానం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ సినిమాలలో కూడా అజయ్ ఘోష్ నటించారు. రన్ రాజా రన్, జ్యోతి లక్ష్మి, బహుబలి 2, భాగమతి, రంగస్థలం వంటి సినిమాలలో అజయ్ ఘోష్ నటించారు. ఇక తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పారు.

ఆచార్య సినిమాలో నటించాల్సి ఉన్నింది…
తెలుగు సినిమాలలో విలన్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న అజయ్ ఘోష్… తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తో కలసి నటించే అవకాశం పోయిందని చెప్పుకొచ్చారు. కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో మొదటి సారి చిరంజీవి గారితో కలసి నటించబోతున్నాను అని చాలా సంతోషించాను అని చెప్పారు. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నాకు హార్ట్ ప్రాబ్లమ్ రావడం స్టంట్ వేయించుకోవడంతో సినిమాలో నటించలేకపోయాను అని చెప్పారు. అయితే తరువాత అయినా ఖచ్చితంగా కొరటాల దర్శకత్వంలో సినిమా ఖచ్చితంగా చేస్తాను అని అజయ ఘోష్ చెప్పుకొచ్చారు.

ఇక రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో ఫైట్ సీన్ చేసే అపుడు కాలికి దెబ్బ తగిలిందని, అయితే వెంటనే రామ్ చరణ్ గారు అపోలో హాస్పిటల్ కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారని చెప్పారు. రామ్ చరణ్ చాలా గొప్పవాడు, నాకు అలా అవ్వగానే చాలా సహాయం చేశారు అని చెప్పుకొచ్చారు. అయితే వయసు రీత్య కాలికి తగిలిన దెబ్బ పోలేదని చెప్పుకొచ్చారు.






























