అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఖచ్చితంగా ఉండాలన్న సత్యాన్ని నిరూపిస్తూ బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తోంది యాంకర్ విష్ణుప్రియ. అనసూయ, రశ్మీలాంటి స్టార్ యాంకర్స్ కి గట్టి పోటీయే ఇస్తుంది విష్ణు ప్రియ. ‘పోవే పోరా’ ప్రోగ్రాంలో సుధీర్ కు జోడిగా చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది.

ఈ ప్రోగ్రాం తో బాగా ఫాపులర్ అయింది. ఈ ప్రోగ్రాం చేయకముందు షార్ట్ ఫిల్స్, వెబ్ సిరీస్ లో విష్ణు ప్రియ నటించింది. ఇప్పుడు మాత్రం తనదైన స్టైల్లో హావభావాలు పలికిస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది. ఇక టాలీవుడ్ నట సామ్రాట్, సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు గారి మనవడు.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు. ఇన్ని ఉన్న అక్కినేని 3వ తరం వారసుడు అఖిల్‌కు మాత్రం కాలం కలిసి రావడం లేదనే చెప్పాలి. చిన్న వయస్సులోనే “సిసింద్రీ” గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అదరగొట్టాడు. ఆ తర్వాత అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన ‘మనం’ చిత్రం క్లైమాక్స్ లో మెరుపులా వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు అఖిల్. ఆ తర్వాత తన పేరుతోనే వచ్చిన ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నట వారసుడు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు చూడ్డానికి గ్లామరస్‌గా మరో మహేశ్ బాబులాగ వున్న అఖిల్ ఖచ్చితంగా స్టార్ హీరో కావడం గ్యారంటీ అని టాలీవుడ్ సినీ ప్రముఖులు అనుకున్నారు. కానీ అఖిల్ విషయంలో ప్రేక్షకులతో పాటు సినీ పెద్దల అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. అక్కినేని అఖిల్ కి తండ్రి నాగార్జున సపోర్ట్ వున్నా ఇప్పటికీ హిట్ కోసం శ్రమిస్తూనే వున్నారు. కానీ అఖిల్ క్రేజ్‌కి తగ్గ హిట్ మాత్రం దక్కడంలేదు. ఇక అసలు విషయానికి వస్తే..

ప్రస్తుతానికి హీరో అఖిల్, యాంకర్ విష్ణప్రియల ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. అఖిల్ సినీ కెరీర్ గ్రాఫ్ లో ఒక్క హిట్ లేకపోయినా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు. అఖిల్ అంటే అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. యాంకర్‌లు కూడా అఖిల్ అంటే మనసు పారేసుకుంటున్నారు. తమ ఒంటిపై అఖిల్ గుర్తుగా టాటూలు కూడా వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. లేటెస్ట్ గా పోరా – పోవే ఫేమ్ విష్ణు ప్రియ కూడా తన ఎడమ చేతిపై అఖిల్ పేరుని టాటూగా వేయించుకోవడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఈ విషయం ప్రముఖ యాంకర్ ఝాన్సీ నిర్వహిస్తున్న లవ్ యూ జిందగీ షో ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఈ షోలో టాప్ యాంకర్‌లు శ్రీముఖి, విష్ణు ప్రియ పాల్గొన్నారు. షోలో భాగంగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్‌ని ప్రేక్షకులకు తెలియజేయాలని యాంకర్ ఝాన్సీ వీళ్ళిద్దరిని కోరింది. ముందు శ్రీముఖి తనకు సంబంధించిన సీక్రెట్స్ తో పాటు విష్ణు ప్రియకు సంబంధించి సీక్రెట్స్ కూడా వున్నాయని చెప్పడంతో ఝాన్సీ ఒకటి చెప్పమని అడిగిందంట. `ఒక వ్యక్తి విష్ణు ప్రియ లైఫ్‌లో చాలా స్పెషల్. దేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగితే ఖచ్చితంగా అఖిల్ అక్కినేనితో పెళ్లి కావాలని విష్ణు ప్రియ అడుగుతుందని, కావాలంటే తన చేయిపై వున్న టాటూని చూడమని శ్రీముఖి అసలు సీక్రెట్ బయటపెట్టేసింది. అదండి సంగతి. మొత్తానికి మన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అఖిల్ అమ్మాయిల పాలిట రొమాంటిక్ హీరో అయిపోయాడన్నమాట.!



























