Akkineni Amala : కోట్ల ఆస్తులున్నా అమల సింపుల్ గా ఉండటానికి కారణం అదేనట…!

0
277

Akkineni Amala : బెంగాలీ అయిన అమల భరత నాట్యకారిణి కావడంతో దేశ విదేశాలలో ప్రదర్శనలిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె తొలి సినిమాతోనే మంచి హిట్ ఖాతాలోకి వేసుకుని ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. అలా తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ ఇలా పలు భాషలలో నటించిన అమల 92లో అక్కినేని నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన అమల దాదాపు 20 ఏళ్ల తరువాత మళ్ళీ శేఖర్ ఖమ్ముల ‘లైఫ్ ఈస్ బ్యూటిఫుల్’ సినిమాలో కనిపించారు. అయితే అమల బ్లూ క్రాస్ కోసం పనిచేస్తూ అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. అయితే ఎక్కడ కనిపించినా చాలా సింపుల్ గా మెడలో ఒక నల్లపూసల దండతో కనిపిస్తారు.

కోట్ల ఆస్తులున్నా మెడలో ఎందుకు బంగారం వేసుకోరు…

అమల చాలా సాధారణంగా చీరలో ఒక నల్లపూసల దండ వేసుకుని కనిపిస్తుంటారు. ఎన్నో కోట్ల ఆస్తులున్నా ఆమె ఎందుకని అంత సింపుల్ గా ఉంటారంటే ఆమెకు బంగారం అంటే అలర్జీ ఉండటమే కారణం అంటున్నారు. బంగారం వేసుకుంటే ఆమె చర్మంకి రియాక్షన్ ఇస్తుందట.

చర్మం వెంటనే ఎర్రగా మారిపోయి ఇబ్బందిగా ఉంటుందట అమల గారికి అందుకే ఆమె బంగారం జోలికి అసలు వెళ్లరట. కేవలం నల్లపూసల దండ మెడలో వేసుకుని సింపుల్ సారీ లో కనిపిస్తారు. ఇక లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమా తరువాత అమల వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ ‘మనం’లో కనిపించారు. ఆ తరువాత లేటెస్ట్ గా శర్వానంద్ సినిమా ‘ఒకే ఒక జీవితం’లో శర్వ తల్లిగా నటించారు.