Akkineni Heroes pan Indian films :ఒకప్పుడు సినీ పరిశ్రమ అనగానే ఎన్టీఆర్, ఏన్ఆర్ గుర్తొస్తారు. వాళ్లిదరు సినీ పరిశ్రమకు రెండు కళ్ళు లాంటి వారని అందరు భావిస్తారు. ఆ తర్వాత తరంలో నాలుగు స్తంభాలుగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున నిలిచారు. నాగార్జున బాలకృష్ణ లు వల్ల తండ్రుల వారసత్వాన్ని నిలుపుతూ సినిమాల్లో రాణించారు. అగ్ర హీరోలుగా వెలిగారు. ఇక ఇపుడు నాగార్జున తర్వాత వచ్చిన అక్కినేని వారసులు మాత్రం ఈ విషయం లో వెనుకబడ్డారనే చెప్పాలి.

పాన్ ఇండియా హీరోలు ఎప్పుడవుతారు….
బ్రహ్మాస్త్ర లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ నాగ్ నటించారు. ఇక చిరంజీవి, రవితేజ కూడా తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ కు సిద్ధం చేస్తున్నారు. కుర్ర హీరో అయిన విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు తన తదుపరి చిత్రాలను పాన్ ఇండియా రేంజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్లు అయిపోయారు. ఇక బన్నీ పుష్ప సినిమాతో ఆల్ ఓవర్ ఇండియా సూపర్ క్రేజీ హీరో అయ్యాడు.
ఇక నాగచైతన్య ఇపుడిపుడే హిట్లు కొడుతున్నాడు. అయితే లోకల్ గానే తన మార్కెట్ పెంచుకోడానికి ట్రై చేస్తున్నాడు చైతు. ఇక చైతన్య ఇటీవల అమీర్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ ఫిల్మ్ లాల్ సింగ్ చద్దా లో నటించాడు ఈ సినిమా ను ఆగష్టు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక బ్రహ్మాస్త్రా, లాల్ సింగ్ చద్దా విడుదలయితే పాన్ ఇండియా హీరోలుగా అక్కినేని హీరోలు వస్తారు. ఇక చైతు ఇపుడు తమిళ మార్కెట్ పైన కన్నెసాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్ తమిళం లోనూ విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సైలెంట్ గా హిట్లు కొడుతూ చైతన్య మెల్లగా తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అఖిల్ ఇంకా మంచి సూపర్ హిట్ ను అందుకోవాల్సి ఉండి హీరోగా నిలదొక్కుకునే మంచి కథలను ఎంచుకోవాల్సి ఉంది. ఏదేమైనా అక్కినేని హీరో లు నెమ్మదిగా తమ మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలానే పాన్ ఇండియా స్టార్లుగా ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.































