Akkineni Naga Chaithanya : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చైతు, సమంతల జంట చూడముచ్చటగా ఉండేది. ‘ఏమ్మాయ చేసావే’ సినిమాతో ప్రారంభమైన వీరి ప్రయాణం 2017లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే వారి నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకోవడానికి గల కారణం ఇప్పటికీ బయటికి చెప్పకపోయినా ఎవరి దారిలో వాళ్ళు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఈ సంఘటన జరిగి ఇన్నేళ్లు అవుతున్నా దానికి సంబంధించిన ఎదో ఒక విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.

నా పర్సనల్ లైఫ్ గురించి వారికి బాగా తెలుసు…
ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ధూత’ అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. చైతు ఒక జర్నలిస్ట్ పాత్రలో నటించగా, ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు ధూత సిరీస్ వచ్చింది. ఇప్పటికే పాజిటివ్ రివ్యూని సొంతం చేసుకున్న ఈ సిరీస్ లో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ధూత వెబ్ సిరీస్ ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటున్న చైతు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

తన వ్యక్తిగత జీవితం గురించి అందరూ దృష్టి పెట్టడం తనకు ఇబ్బందిగా లేదని, అయితే తన వర్క్ పరంగా తనని గుర్తుంచికోవడం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చాడు. ఏదైనా విషయాన్ని ఒక పాయింట్ తర్వాత నేను పట్టించుకోను, నాకు సన్నిహితంగా ఉన్నవారికి నిజాలు బాగా తెలుసు. నా వ్యక్తిగత జీవితం ద్వారా కాకుండా నా వర్క్ పరంగా మాత్రమే నేను అందరికీ గుర్తుండాలని చెప్పారు. ఇక నుండి నటన మీదే దృష్టి పెడతానని, నా సినిమాలు అభిమానులను ఆకట్టుకుంటే వాటి ద్వారా మాత్రమే అందరూ నన్ను గుర్తుపెట్టుకుంటారు అని చైతు చెప్పుకొచ్చాడు.



























