Akkineni Nageswararao : ఆనాటి చిత్ర పరిశ్రమ మూలస్థంబాలలో అక్కినేని నాగేశ్వర రావు గారు కూడా ఒకరు. 1941 లో ‘ధర్మపత్ని’ సినిమాతో చలన చిత్ర రంగానికి పరిచయం అయినప్పటికీ, 1944 లో వచ్చిన ‘సీతారామ జననం’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కూడా కలిపి దాదాపు 256 సినిమాలలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. డబ్బున్నవారు లేని వారు అన్న భేదం లేకుండా అందరితోనూ స్నేహ భావం తో అందరికీ దగ్గర అయ్యారు.

అప్పట్లో నాగేశ్వరరావుకు, నాగార్జునకు ఆ విషయంలోనే గొడవట…
అక్కినేని నాగేశ్వరరావు తన నట వారసుడిగా నాగార్జున ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు నాగార్జున సినిమా కెరీర్ గొప్పగా ఉండేలా పునాదులు వేసాడు. కానీ నాగేశ్వర రావు ఇంకా నాగార్జునకు అమల విషయంలో మాత్రం గొడవలు జరిగాయి అని అప్పట్లో అనుకునే వారు. మొదట నాగార్జున దగ్గుబాటి ఇంటి అమ్మాయి ని పెళ్లిచేసుకొని తరువాత విడిపోవడం తెలిసిందే. తరువాత అమలతో పెళ్లి గురించి అనుకున్నప్పుడు నాగేశ్వరరావుకు అది ఇష్టం లేక గొడవలు జరిగాయట. కాకపోతే ఆ గొడవలు బయటికి రాకుండా పెళ్లి చేశారు.

అయితే మొదట్లో నాగేశ్వరరావుకు అమల అంటే అంత నచ్చేది కాదట. కానీ ఒకరోజు అమల నాగేశ్వరరావు గారి పాదాలకు నమస్కారం చేస్తూ… నా వల్ల మీ మనసును బాధపడి ఉంటే నన్ను క్షమించండి. నేను ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయాలని ఎప్పుడు అనుకోలేదు. మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం అందుకే పెళ్లి చేసుకున్న, మీరు కూడా నా తండ్రి లాంటి వారే అని చెప్పిందట. ఆ మాటలకి ఇన్నాళ్లు అంత తప్పుగా ఆలోచించాని ఏడ్చారని అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. ఆ తరువాత నాగేశ్వరరావు అమలని కూతురిలా చూసుకున్న సంగతి తెలిసిందే.































