నాగార్జున తోబుట్టువులందరిని ఎప్పుడైనా చూసారా.. ఎంత మంది సిస్టర్స్ మీకు తెలుసా ?

0
354

టాలీవుడ్ చిత్ర సీమ లో కొన్ని కుటుంబాలు బాగా ప్రాముఖ్యం చెందాయి. హాలీవుడ్ బడా హీరోలు అందరూ ఆ ఇంటి వారి నుండి వచ్చిన వారే. టాలీవుడ్ లో బడా హీరోల కుటుంబ విషయాలు చూస్తే ముఖ్యంగా…. నందమూరి వారి కుటుంబం, అక్కినేని వారి కుటుంబం, ఘట్టమనేని కుటుంబం, కొణిదెల వారి కుటుంబం, దగ్గుబాటి కుటుంబం, మంచు వారి కుటుంబం ఇలా ఇలా అనేక కుటుంబాలు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాయని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే మనం అక్కినేని వారి కుటుంబం గురించి చూస్తే… మొదటి జనరేషన్ లో తెలుగు చిత్రసీమకి ఓ పిల్లర్ గా మారిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చిత్రసీమ మొదలైనప్పుడు ప్రముఖ హీరోల్లో మొదటిగా ఉండే వ్యక్తి ఈయన. టాలీవుడ్ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకురావడంలో ఈయన ప్రముఖ పాత్ర వహించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. ఆవిడ పేరు మీద హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ స్టూడియో నిర్మించాడు. ఇక వీరిద్దరి దంపతులకు మొత్తం ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఇక వారి విషయాలు ఒక సారి చూస్తే కొడుకులు అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున ఉన్నారు. ఇక వీరి కుమార్తె విషయానికి వస్తే అక్కినేని సత్యవతి, అక్కినేని నాగసుశీల, అక్కినేని సరోజ. ఇక అక్కినేని వెంకట్ గురించి చూస్తే… టాలీవుడ్ పరిశ్రమలో ప్రసిద్ది నిర్మాత. 1975 సంవత్సరంలో మొదలు పెట్టిన అన్నపూర్ణ స్టూడియో ను స్థాపించడంలో ఈయన కూడా ప్రముఖంగా పనిచేశారు. 1978 లో అన్నపూర్ణ స్టూడియోస్ మేనేజర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఆ తరువాత అత్యుత్తమ స్టూడియో లలో ఒకటిగా మార్చడానికి ఆయన ఎంతగానో శ్రమించారు.

ఇక మరో కుమారుడు అక్కినేని నాగార్జున. మూడు దశాబ్దాల నుండి టాలీవుడ్ చిత్రసీమలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు అక్కినేని నాగార్జున. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలు ఆయన కలిగి ఉన్నారు. ఇక ఆయన మొదటగా దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి కలిగిన సంతానమే అక్కినేని నాగ చైతన్య. ఆ తర్వాత వారిద్దరికి మనస్పర్థల కారణంగా వారిద్దరు విడిపోయారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోయిన్ అమ్మలను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ పుట్టిన కొడుకే అక్కినేని అఖిల్.

ఇక అక్కినేని ఫ్యామిలీ లో ఆడపిల్లల విషయానికి వస్తే మొదటగా అక్కినేని సత్యవతి యార్లగడ్డ సురేంద్ర గారిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి కలిగిన సంతానమే హీరో సుమంత్.

ఇక మరో కుమార్తె అక్కినేని నాగసుశీల. ఈవిడ అనుమోలు అచ్యుత రంగారావు గారిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే హీరో సుశాంత్. ఇక అక్కినేని నాగేశ్వరావు గారి మరో కుమార్తె అక్కినేని సరోజ. ఈవిడ స్వర్గస్తులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here