ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా పట్టణం, గ్రామం.. ధనిక, పేద అనే భేధం లేకుండా ఎవ్వరినీ వదలడం లేదు. రోజు కూలీ నుండి అన్నీ జాగ్రత్తలు తీసుకునే ధనవంతుల వరకూ అందరూ కరోనా మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు, ఈమధ్యకాలంలో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.!.మరిప్పుడు తాజాగా కరోనా భాధితుల జాబితాలోకి టాలీవుడ్ ప్రముఖులు హీరో నాగ చైతన్య, ఆయన భార్య స్టార్ హీరోయీన్ సమంత కూడా చేరబోతున్నారనే గాసిప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలోనే కాకుండా సమంత నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గానే ఉంటుంది. అయితే ఇంతకీ అసలు విషయమేమిటంటే.. తాజాగా తన ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్ప బుగ్గపై సమంత ముద్దు పెడుతూ ఉన్న ఓ ఫోటోను ఇంస్టాగ్రమ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో ను షేర్ చేసిన వారానికే శిల్పకి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. శిల్పకి ఒక్కసారిగా కరోనా అని తేలడంతో సమంత కు చైతన్యకు కూడా కరోనా వచ్చిందేమోనని అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఈ గాసిప్స్ ఎంతవరకూ నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు. అదండి సంగతి.. మొత్తానికి ఈ కరోనా టాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేస్తుందన్నమాట.. కాబట్టి మీరూ జాగ్రత్తగా వుండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here