ఎవరైనా గాని తల్లిదండ్రులు వారి బిడ్డలను కనడం, ఆ తర్వాత పెంచడం వారిని ఒక ఒక మనిషి తో సంబంధం ఏర్పడిన వారి జీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నం వరకు చూస్తారు. ఆ తర్వాత వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించడం, కొనసాగించకపోవడం వారి బిడ్డల చేతుల్లో మాత్రమే ఉంటుంది. వారి బిడ్డలను కంటారు మాత్రమే, అయితే వారి తలరాత మాత్రం మార్చలేరు కొంతమందికి. సరిగ్గా ఇదే విషయం నటుడు సుమంత్ తన సోదరి నటి సుప్రియ ల జీవితం కూడా అలాగే జరిగింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హీరోగా చెప్పే వారిలో లో ఒకటి గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు మూడు తరాల నటులతో కలిసి నటించారు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలలో ఒకరు. అలాగే అక్కినేని నాగేశ్వరావు కు హీరో నాగార్జున మాత్రమే కాకుండా పెద్ద కొడుకు వెంకట్, కూతుర్లు సత్యవతి, నాగ సుశీల, సరోజ కూడా ఉన్నారు.

ఇందులో నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి. ఆమె భర్త పేరు యార్లగడ్డ సురేంద్ర. వీరిద్దరి వివాహం అనంతరం వారిద్దరికీ టాలీవుడ్ హీరో సుమంత్, నటి సుప్రియ లు జన్మించారు. అయితే కొన్ని కారణాల వల్ల సత్యవతి గారు మరణించారు. ఇక కూతురి మరణంతో తన మనవడు, మనవరాలు ఇద్దరినీ తానే పెంచారు అక్కినేని నాగేశ్వరరావు. వారిద్దరికీ ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా వారిని తీర్చిదిద్దారు. ఇకపోతే హీరో సుమంత్ తన బాల్యం మొత్తం హైదరాబాదులో గడిపినా, ఇంజనీరింగ్ విద్యను చదువుకోవడానికి మాత్రం అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీలో చేరారు. అయితే అక్కడ ఆయనకు ఆ కోర్సు నచ్చకపోవడంతో అది మానేసి అక్కడే ఉన్న యాక్టింగ్ స్కూల్లో డిగ్రీ సాధించారు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చాక 1999 సంవత్సరంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రేమకథ అనే సినిమా ద్వారా టాలీవుడ్ తెరంగేట్రం చేశాడు సుమంత్.

ఇక ఆపై స్నేహమంటే ఇదేరా, పెళ్లి సంబంధం, యువకుడు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్. ఇలా సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరోయిన్ కీర్తి రెడ్డి తో ప్రేమలో పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2004లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ సంసారం కొన్నాళ్ళు సాఫీగా సాగేనా ఆ తర్వాత అనేక మనస్పర్థలు రావడంతో.. అవి కూడా తారాస్థాయికి చేరుకోవడంతో వారిద్దరూ 2006లో విడాకులు తీసుకున్నారు.

అయితే ఇలాంటి ప్రేమ వ్యవహారం కూడా తన చెల్లి సుప్రియ జీవితంలో కూడా జరిగింది. ఇవిడ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో 1995 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలి సినిమా అక్కడ అమ్మాయి… ఇక్కడ అబ్బాయి… అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. అయితే అప్పుడు నటించిన ఆవిడ మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అడవి శేషు నిర్మించిన గూడచారి సినిమాలో కీలక పాత్రలో నటించింది.

ఈవిడ కూడా ఇష్టం అనే సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డి ని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరి సంసారం కూడా కొన్నాళ్ళు బాగానే జరిగిన ఆ తర్వాత అతను చెడు వ్యసనాలకు బానిస గా మారడంతో సుప్రియ ఎన్నిసార్లు సర్ది చెప్పినా తాను మారక పోవడంతో ఆయనకు విడాకులు ఇచ్చింది. వీరిద్దరికీ ఒక కుమార్తె కూడా ఉంది. వీరిద్దరూ విడిపోయా కూడా చరణ్ రెడ్డి ప్రవర్తన మారకపోవడం కాకుండా మరింతగా పెరిగిపోయి. దీంతో ఆయన ప్రాణాలు కూడా కోల్పోయారు. అక్కినేని నాగేశ్వరరావు హీరో సుమంత్, తన సోదరి సుప్రియ లను తన గుండెలపై పెట్టుకుని పెంచుకున్న ఆయన పెళ్లి చేశారు కానీ, వారి జీవితాలను తీర్చిదిద్దే లేకపోయారు. ఇకపోతే అన్నా చెల్లెలు ఇద్దరు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే అక్కినేని నాగేశ్వరావు గారి ఆత్మ శాంతించాలి అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అంటున్నారు కొందరు అక్కినేని అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here