కరోనాపై పోరుకోసం సెలెబ్రెటీస్ అందరు తమ భారీ విరాళాలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి తనగొప్ప మనసును చాటుకున్నారు. ఇదివరకే పీఎం కేర్ ఫండ్స్ కు రూ.25కోట్ల భారీ విరాళాన్ని అందించిన అక్షయ్ ఇప్పుడు మరోసారి మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం భారీ విరాళాన్ని అందించి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. ఈ క్రమంలో ముంబై కార్పొరేషన్ కు రూ.3కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ డబ్బును మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఏక్విప్మెంట్ (పిపిఈ) కు అందజేశారు. ఈ విషయాన్నీ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.

#Update: After contributing ₹ 25 cr to #PMCares, #AkshayKumar contributes ₹ 3 cr to #BMC to assist in the making of PPEs, masks and rapid testing kits… #COVID19Pandemic #CoronaVirus #Covid_19 #COVID19
— taran adarsh (@taran_adarsh) April 10, 2020

అయితే ఇదివరకే భారీ విరాళం అందించిన అక్షయ్ తాజాగా 3 కోట్ల విరాళం ఇచ్చి, మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. అక్షయ్ ఉదార స్వభావానికి అభిమానులు మరియు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



























