కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 17 వరకు కొనగిస్తూ నిర్ణయం తీసుకుంది అదే సమయంలో కొన్ని సడలింపులిస్తూ కొన్ని వ్యాపారాలు తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది. అదే క్రమంలో మద్యం షాపులు ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టని కారణంగా ప్రజలు మద్యం కోసం బయటకు రావడంతో వైరస్ మరింతగా విజృభించే అవకాశం ఉందంటూ మద్యం విక్రయాలను నిషేధించాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు.

ఈ నేపథ్యంలో లిక్కర్ విక్రయాలను ఆపబోమని స్పష్టం చేసింది. కానీ రాష్ట్రాలు మద్యం హోమ్ డెలివరీ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. వైన్స్ షాపు వద్ద రద్దీని తగ్గించేందుకు ఆన్లైన్ లేదా హోమ్ డెలివరీ విధానాలను అవలంబించవచ్చని చెప్పింది. కానీ మధ్యం నిషేధంపై తాను నిర్ణయాన్ని తీసుకోలేమని ఆ పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీం కోర్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here