టాలీవుడ్ బుల్లితెర, వెండితెర నటుడు అలీ రెజా గురించి అందరికీ పరిచయమే. తెలుగులో ప్రసారమయిన బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3 లో కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తన గేమ్ తో, తన ఉండే విధానంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ షోతోనే అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ కు రాకముందు ఇతడు చాలామందికి తెలియదు. సీరియల్ చూసే ఆడియన్స్ కు మాత్రమే అతడు సుపరిచితం. కానీ బిగ్ బాస్ తర్వాత తనేంటో తాను నిరూపించుకున్నాడు.

తాజాగా ఆలితో సరదాగా షోలో గెస్ట్ గా వచ్చిన అలీ బిగ్ బాస్ షో తరువాత తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు పంచుకున్నారు. ఈ మధ్య సీరియల్స్ లో ఎందుకు కనిపించడం లేదని హోస్ట్ ఆలీ అడగగా.. తనను రెండేళ్ళు బ్యాన్ చేశారని చెప్పి అందరికీ షాకిచ్చాడు. నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ షో కి వెళ్లి తప్పుచేసాను. ఆ తరువాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి రమ్మని ఫోన్ చేశారు. నేను వెళ్లేసరకి అలీ రెజా నువ్వు రెండు సంవత్సరాలు బ్యాన్ అన్నారు. ఆ మాట విని ఒక్కసారిగా నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది అంటూ చెప్పుకొచ్చాడు అలీ రెజా. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































