Aliya Bhatt : ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచమంతా ఆర్ఆర్ఆర్ ఫీవర్ లో ఉందని చెప్పాలేమో.ఎటు చూసిన ఆర్ఆర్ఆర్ మనియానే కనిపిస్తోంది.అటు నార్త్ లోనూ, ఇటు సౌతలోనూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇక ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికాల్లో కూడా రచ్చచేస్తోంది. ఇక నేపాల్ ల్లో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇక ఈ సినిమా లో నటించినా రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల నటనకు మంచి మార్కులే పడ్డాయి.రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో నటించినా ఆలియా కూడా నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే తన పాత్ర నిడివి తక్కువ ఉండటంతో ఆలియా అసంతృప్తిగా ఉందని వార్తలు వినిపించాయి, రాజమౌళిపై గుర్రుగా ఉండంటూ పుకార్లు వినిపించాయి.
ఇక ఈ పుకార్లకు చెక్ పెడుతూ ఆలియా ఆర్ఆర్ఆర్ పై స్పందించింది. . ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం హిందీలో రూ.100 కోట్ల వసూళ్లను దాటిందని, ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. అంతేకాకుండా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్బ్ అని పేర్కొంది. దీంతో ఆలియా కోపంగా ఉందన్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది.



























