Allari Naresh : ‘అల్లరి’ సినిమాతో హిట్ కొట్టి ఆ సినిమా పేరునే తన పేరుకు ముందు చేర్చుకున్న నటుడు అల్లరి నరేష్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారి చిన్న కొడుకు. అల్లరి సినిమాతో మొదలయిన ప్రయాణంలో వరుసగా కామెడీ సినిమాలతో హిట్లు కొట్టిన నరేష్ మధ్యలో గమ్యం, శంభో శివ శంభో వంటి సినిమాల్లో నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక 2015 లో పెళ్లి తరువాత అంతగా సక్సెస్ లు అందుకోలేక పోయిన నరేష్ తన నటనకు ఛాలెంజింగ్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ‘నాంది’ అనే సినిమాతో మరోసారి మంచి హిట్ కొట్టాడు. ఇక తాజాగా మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమాతో మరోసారి వస్తున్న నరేష్ పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

నా భార్య కు హీరో అని అసలు తెలియదు…
వరుసగా హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న నరేష్ ఆ తరువాత కామెడీ చిత్రాలనే ఎక్కువగా తీస్తూ సరైన కథలను ఎంచుకోక పోవడం వల్ల ఫ్లాప్స్ వరుసగా పలకరించాయి. ఇక 2015 లో చెన్నై కి చెందిన ఆర్చిటెక్ట్ విరూప ను వివాహం చేసుకున్న నరేష్ కు ఒక పాప. అయితే తాజాగా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విశేషాలను చెబుతూ తన భార్య చెన్నై లో పుట్టి పెరగడం వల్ల తెలుగు సినిమాలను పెద్దగా చూడలేదు.

ఇక చూసినా అగ్ర హీరోల సినిమాలను చూడటం వల్ల నేను సినిమాల్లో ఏదో చేస్తానని తెలుసు కానీ హీరో అనే విషయం పెళ్లయ్యాక తెలిసింది అంటూ చెప్పారు నరేష్. ఇక పెళ్లయ్యాక సరైన హిట్లు లేని నరేష్ కు భార్య చాలా సపోర్ట్ ఇచ్చింది అంటూ చెప్తున్నారు. నాంది సినిమాతో మంచి హిట్ అందుకున్న సమయంలో తన భార్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటూ చెప్పారు.


































