Featured

Allu Arjun: ఆ విషయంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్…. స్పీడ్ మీదున్న ఐకాన్ స్టార్!

Published

on

Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో మన తెలుగు హీరోల హవా కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఉన్న ఎంతో మంది హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు పొందారు. మొదట బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా వల్ల రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొందారు.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజమౌళి అండ లేకుండానే పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి సంచలనం రేపింది. దీంతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఒకే ఒక్క సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

ప్రస్తుతం మన తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో వారి మార్కెట్ విస్తరించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి రెమ్యూనరేషన్ కూడా ప్రతి సినిమాకు పెరిగిపోతూనే ఉంది. మొదట బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత అదే తరహాలో భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రెమ్యూనరేషన్ విషయంలో ప్రభాస్ ని మించిపోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Allu Arjun: భారీ రెమ్యూనరేషన్ అందుకోపోతున్న బన్నీ…


అలాగే ఆ సినిమా తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి అల్లు అర్జున్ తీసుకుని రెమ్యూనరేషన్ ప్రభాస్ రెమ్యునరేషన్ ని మించిపోయిందని సమాచారం. సందీప్ వంగా దర్శకత్వంలో రానున్న సినిమాకి బన్నీ అక్షరాలా రూ.125 కోట్లు డిమాండ్ చేశాడనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ఏ తెలుగు హీరో ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం బన్నీ, ప్రభాస్ ని దాటేసి సరికొత్త రికార్డ్ సృష్టించిన హీరోగా నిలిచిపోతాడు.

Advertisement

Trending

Exit mobile version